KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
KTR, TN CM Vijay, and YS Jagan | చెన్నై నగరంలో ఘనంగా జరిగిన వైఎస్ కుటుంబ సభ్యుల వివాహ వేడుక రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
KTR, TN CM Vijay, and YS Jagan | చెన్నై నగరంలో ఘనంగా జరిగిన వైఎస్ కుటుంబ సభ్యుల వివాహ వేడుక రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు దక్షిణాది రాజకీయాల్లో ప్రముఖులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు), తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై సందడి చేశారు. ఈ వివాహ వేడుకలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు అందరూ ఒకే వేదికపైకి చేరడం విశేషం.
ఈ సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్‌ని, బీఆర్ఎస్ నేత కేటీఆర్, వైఎస్ జగన్‌లు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, ప్రశ్నలు అడుగుతూ చాలా ఉత్సాహంగా ముచ్చటించుకున్నారు. ముఖ్యంగా కేటీఆర్, వైఎస్ జగన్ , తమిళనాడు సీఎం విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన క్షణాలు సౌత్ ఇండియన్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్రముఖుల రాకతో అక్కడ సందడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి విచ్చేసిన ఈ దిగ్గజ నేతలు ముగ్గురు ఒకే వేదికపై కనిపించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు ఇలా ఒకే వేదికపై కలవడం పట్ల అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు.
With @ysjagan Garu and Thiru @TVKVijayHQ at a wedding last night https://t.co/6i3ICAdGnP
— KTR (@KTRBRS) November 6, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

