KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
KTR | మియాపూర్‌లో 550 ఎకరాల భూములు వస్తే అమ్మేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆ భూముల్లో 200 ఎకరాలు పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతాది పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టించు.. మేము గొప్పగా స్వాగతిస్తామన్నారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్.
KTR | శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మీరంతా రేవంత్ రెడ్డి మాటలు వింటా ఉన్నరు.. ఆయనే కదా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇస్తా అన్నడు.. మరి ఇప్పుడు మియాపూర్‌లో జాగా వచ్చింది కదా.. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ భూముల్లో తెలంగాణ ఉద్యమంలో పని చేసినవాళ్లందరికీ జాగా ఇస్తావా..? గట్టిగా చప్పట్లతో ఆయనను అడగండి అని అన్నారు. హైదరాబాద్‌లోని పేదలందరికీ 100 ఎకరాల్లో మంచిగా టవర్స్ కట్టు.. అందరికీ పేదవాళ్లకు ఇండ్లు ఇయ్యి.. మేమన్నా వద్దంటున్నమా..? అన్నారు.
నువ్వే అంటున్నవ్ కదా కేసీఆర్ అక్కడెక్కడో 75 కిలోమీటర్ల దూరంలో ఎర్రవెల్లి అనే ఊరిలో ఉన్నరు.. హైవే నుంచి లోపలికి 12 కిలోమీటర్ల లోపల ఉంటది.. అట్లాంటి ఎర్రవెల్లిలో కేసీఆర్ ఉంటున్నరన్న కోపంతో.. రాష్ట్ర రాజకీయాలకు అది కేంద్రబిందువైందన్న కోపం మీద అమర వీరులను తీసుకుపోయి ఎర్రవెల్లిలో కాలనీ కట్టిస్తడట రేవంత్ రెడ్డి.. మరి నేనడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఎక్కడో ఎర్రవల్లిలో 80 కిలోమీటర్ల అవతల ఎందుకయ్యా..మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టియి.. మేమొద్దంటున్నమా..? అని కేటీఆర్ అన్నారు.
భూములు వస్తే అమ్మేస్తా అంటున్నడు..
మియాపూర్‌లో 550 ఎకరాల భూములు వస్తే అమ్మేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆ భూముల్లో 200 ఎకరాలు పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతాది పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టించు.. మేము గొప్పగా స్వాగతిస్తామన్నారు.
సంవత్సరం లోపల కేసీఆర్ మళ్లీ తిరిగి రాబోతున్నారు.. ఎవరైనా పారిశ్రామికవేత్తలు రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడితే.. మీరు పొరపాటున హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో జరుగుతున్న (హిల్ట్ పీ) స్కాంలో భాగస్వాములైతే అనుభవించేది మీరు.. ఆ తర్వాత మమ్మల్ని అనొద్దు. మా ప్రభుత్వం ప్రజల దయతో, దేవుడి ఆశీర్వాదంతో తప్పకుండా వస్తది. వచ్చిన వెంటనే ఈ భూములన్నింటికి చెక్ పెడతమన్నారు.
సంవత్సరం లోపల కేసీఆర్ రాబోతున్నాడు
రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకులకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆశపడి హిల్ట్ పీ స్కాంలో భూములు కొంటే తిరిగి అనుభవిస్తారు
మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఇప్పుడు జరుగుతున్న భూదందాలన్నింటికీ చెక్ పెడతాం
మియాపూర్‌లో 550 ఎకరాల భూములు వస్తే అమ్మేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు
ఆ భూముల్లో 200 ఎకరాలు పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతాది పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టించు.. మేము గొప్పగా స్వాగతిస్తాం
– కేటీఆర్
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

