KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
KCR | తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చారిత్రక మైలురాయని కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29 దీక్షతోనే డిసెంబర్ 9 ప్రకటన, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావానికి మార్గం ఏర్పడిందని గుర్తుచేశారు.
KCR | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక మైలురాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని ప్రతినబూని 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష దేశ రాజకీయాలను మలుపు తిప్పిందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కదిలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందని తెలిపారు. దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజును గుర్తుచేసుకుంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు.
ఒక దీక్ష.. ఒక సంకల్పం.. ఒక రాష్ట్రం అంటూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోరాటాన్ని కేటీఆర్ కొనియాడారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిందన్నారు. అణచివేతకు గురైన తెలంగాణ నేల విముక్తి కోసం ఓ భూమిపుత్రుడు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి, ప్రజల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి గుర్తింపు తీసుకొస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. మూడున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, దీక్ష ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచాయని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2 తేదీలకు విడదీయలేని సంబంధం ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టకపోతే డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన వచ్చేది కాదని, ఆ ప్రకటన లేకుంటే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. తన సందేశం చివరలో ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

