ఉప్పొంగిన అభిమానం.. ఆదిలాబాద్ వైపు ఎన్‌హెచ్ 44 పొడవునా కేటీఆర్‌కు స్వాగతం
ఆదిలాబాద్‌లో ఆదివారం నిర్వహించిన రైతుగర్జన సభకు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జా తీయ రహదారి 44పై అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
- హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు గులాబీ శ్రేణుల జోరు
నిజామాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్‌లో ఆదివారం నిర్వహించిన రైతుగర్జన సభకు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జా తీయ రహదారి 44పై అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. కేటీఆర్ కాన్వాయ్ కనిపించగానే కార్యకర్తలు ఉత్సాహంతో పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ఆహ్వానిస్తూ తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి వెంటే పలుచోట్ల పార్టీ శ్రేణులు కేటీఆర్ రాక కోసం ఎదురు చూశారు. కాన్వాయ్ చేరుకోగానే జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలతో మార్మోగించగా.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేటీఆర్ ముందుకు సాగారు.
దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన ఎన్‌హెచ్ 44పై కేటీఆర్ ప్రయాణం పార్టీ శ్రేణుల సందడితో సాగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నివాసానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోగా.. మామిడిపల్లి చౌరస్తా వద్ద భారీ క్రేన్‌ను ఉపయోగించి గజమాలతో స్వాగతం పలికారు. శ్రేణులకు అభివాదం చేస్తూ కేటీఆర్ ముందుకు కదిలి ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

