రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
ఆదిలాబాద్ రిమ్స్ బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాధిత కొడప దుర్గా మారుతి కుటుంబానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు నూతన వస్త్రాలను అందజేశారు.
ఆదిలాబాద్ రిమ్స్ బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ములగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ కోలాం వర్గానికి చెందిన నిరుపేద కుటుంబాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాధిత కొడప దుర్గా మారుతి కుటుంబానికి పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు నూతన వస్త్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కోవ లక్ష్మి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ కోలాం వర్గానికి చెందిన దుర్గా మారుతి కుటుంబానికి జరిగిన అన్యాయం బాధాకరమని పేర్కొన్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేటీఆర్ నాయకత్వంలో తక్షణ సహాయంగా రూ.లక్ష నగదు, నూతన వస్త్రాలను అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంచనపల్లి సర్పంచ్ జ్యోతిరామ్, లింగాపూర్ సర్పంచ్ జాధవ్ రాజశేఖర్, చొర్పల్లి సర్పంచ్ జూగాదిరావు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవురావు, మాజీ జడ్పీటీసీ ఆడే లక్య నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్ రావు, హన్ను పటేల్, బీఆర్ఎస్ సిర్పూర్ (యు) మండల అధ్యక్షుడు తొడసం ధర్మారావు, మాజీ ఎంపీపీ జాధవ్ గణపత్ నాయక్, లింగాపూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ జాటోత్ రాహుల్, ముండే సతీష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు హాజరయ్యారు.
రిమ్స్ బాధితులకు రామన్న భరోసా 🩷
ఆదివాసీ కోలాం కుటుంబానికి రూ.1 లక్ష నగదు, నూతన వస్త్రాలు అందజేసిన కోవ లక్ష్మి.లింగాపూర్ మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ములగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ కోలాం వర్గానికి చెందిన నిరుపేద కొడప దుర్గా మారుతి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన ఎమ్మెల్యే @kova_laxmi
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఆదేశాల మేరకు, బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సహాయంతో పాటు నూతన వస్త్రాలను కోవ లక్ష్మి స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా కోవ లక్ష్మి మాట్లాడుతూ.. 👇🏻
అత్యంత వెనుకబడిన ఆదివాసీ కోలాం వర్గానికి చెందిన దుర్గా మారుతి కుటుంబానికి జరిగిన అన్యాయం విచారకరమని, వారి కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి భరోసాగా ఉంటుందని తెలిపారు.
కేటీఆర్ గారి నాయకత్వంలో బాధితులకు తక్షణ సహాయంగా ఈ లక్ష రూపాయల నగదు మరియు నూతన వస్త్రాలు అందజేశామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కంచనపల్లి సర్పంచ్ జ్యోతిరామ్, లింగాపూర్ సర్పంచ్ జాధవ్ రాజశేఖర్, చొర్పల్లి సర్పంచ్ జూగాదిరావు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవురావు, మాజీ జడ్పీటీసీ ఆడే లక్య నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్ రావు, హన్ను పటేల్, బీఆర్ఎస్ సిర్పూర్(యు) అధ్యక్షులు తొడసం ధర్మారావు, మాజీ ఎంపీపీ జాధవ్ గణపత్ నాయక్, లింగాపూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ జాటోత్ రాహుల్, ముండే సతీష్, బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
— BRS Party (@BRSparty) November 6, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRS
- Kolam Tribe
- Kova Laxmi
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

