Komuravelli | 7న కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు
Komuravelli | చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి ఆదివారం 10.45 గంటలకు ఈ వేడుక జరగనుంది.
Komuravelli | చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 7వ తేదీ వేకువజామున 5గంటలకు స్వామి వారికి దృష్టికుంభం(బలిహరణం),10.45 గంటలకు స్వామి వారి కల్యాణం, మధ్యాహ్నం 12గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7గంటలకు రథోత్సవం(బండ్లు తిరుగుట), 8వ తేదీ సోమవారం ఉదయం 9గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్ధ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆలయ సంప్రదాయం మేరకు వరుడు మల్లికార్జున స్వామి వారి తరపున పడిగన్నగారి వంశస్తులు, వధువులు మేడలాదేవి, కేతమ్మ దేవీ తరపున మహాదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని జరిపిస్తారు. స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి ఆదివారం 10.45 గంటలకు ఈ వేడుక జరగనుంది. కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వేద ఉజ్జయిని పీఠాధిపతి జగద్గురు సిద్ద లింగరాజ దేశికేంద్ర శివాచార్య మహాస్వామీజీ ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహిస్తారు. కొమురవెల్లి క్షేత్రంలో జరిగే ఈ కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మల్లన్న కల్యాణానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హాజరై పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

