Personal Finance | డబ్బుల మెయింటెనెన్స్‌లో మీ స్కోర్ ఎంత? ఇక్కడ చెక్ చేసుకోండి
Personal Finance | డబ్బు లేనిది ఆహారం కొనలేం. నీడ దొరకదు. జీవితభాగస్వామి ప్రేమ పరిపూర్ణంగా లభించకపోవచ్చు. అంటే లైంగిక అవసరాలూ అంతంతమాత్రంగానే తీరుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా డబ్బు అవసరమే. డబ్బుతోనే గౌరవం వస్తుందని చెప్పలేం కానీ, గౌరవానికి డబ్బు ఓ మార్గం.
Personal Finance | భౌతికమైన అవసరాలు.. ఆహారం, నీళ్లు, గాలి, నీడ, సెక్స్.
భద్రతాపరమైన అవసరాలు రక్షణ, ఆరోగ్యం, ఆర్థికం.
ఆత్మసంతృప్తితో ముడిపడిన అవసరాలు గౌరవం, విజయాలు. ఇంకా..
డబ్బు లేనిది ఆహారం కొనలేం. నీడ దొరకదు. జీవితభాగస్వామి ప్రేమ పరిపూర్ణంగా లభించకపోవచ్చు. అంటే లైంగిక అవసరాలూ అంతంతమాత్రంగానే తీరుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా డబ్బు అవసరమే. డబ్బుతోనే గౌరవం వస్తుందని చెప్పలేం కానీ, గౌరవానికి డబ్బు ఓ మార్గం. చాలా సందర్భాల్లో ఆస్తిపాస్తులే సంపాదనకు కొలమానం అవుతున్నాయి. అంటే.. మన జీవితాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. డబ్బును ఎంత జాగ్రత్తగా పొదుపు చేయాలనేది తేనెటీగను చూసి నేర్చుకోవాలి. మనం ఏ లెమన్టీలోనో కలుపుకొనే చెంచాడు తేనె..
ఒక తేనెటీగ జీవితకాల సంపాదన.
మనిషి ఆర్థిక విజయం పొదుపు మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అదొక కళ, శాస్త్రం, చంచలమైన మనసు మీద మనం సాధించే తొలి గెలుపు. కోటి రూపాయలు, పదికోట్లు, వందకోట్లు.. లక్ష్యం వైపుగా తొలి అడుగు. కానీ అక్కడే తప్పటడుగు వేస్తారు చాలామంది. పొదుపును చిన్నచూపు చూస్తారు. మదుపును నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్య బీమాను పట్టించుకోరు. టర్మ్ పాలసీ వృథా అని వాదిస్తారు. స్టాక్ మార్కెట్‌ను పేకాటతో పోలుస్తారు. రియల్ ఎస్టేట్‌ను గాలి బుడగలా చూస్తారు. ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడితే ఒట్టు. బంగారం సంగతి ఎత్తగానే దొంగల భయాన్ని సాకుగా చూపుతారు. ‘కనీసం హౌసింగ్‌లోన్ తీసుకుని ఇల్లయినా కొనవయ్యా బాబూ’ అని బతిమాలినా వినరే! ఈఎమ్ఐలో సగం బ్యాంకు వడ్డీలకే పోతుందని కాకి లెక్కలు చెబుతారు. మార్పు అనివార్యమనీ, జీవితంలో ఎత్తుపల్లాలు తప్పవనీ వీళ్లకెవరు చెప్పాలి? ఒక్కసారి ఊహించుకోండి..

Money Savings3
కొత్త టెక్నాలజీ కారణంగా సిబ్బంది అవసరం తగ్గుతుంది. ఓ పాతిక మందిని ఇంటికి పంపాలని యాజమాన్యం భావిస్తుంది. అందులో మీరూ ఉంటే? నడివయసులో కొలువులు దొరకడం కష్టం. మరో ఉపాధి వెతుక్కోడానికి ఐదారునెలలైనా పడుతుంది. ఆ కాలానికి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?
ఓ వ్యక్తి బైక్ మీద ఆఫీసుకు వెళ్తుంటాడు. వెనుక నుంచి ట్రక్కు గుద్దేస్తుంది. అక్కడికక్కడే మరణిస్తాడు. యాజమాన్యం కంటితుడుపుగా పరిహారం ప్రకటిస్తుంది. కీలక దశలో ఉన్న పిల్లల చదువులు ఎలా సాగాలి? కుటుంబ పోషణ మాటేమిటి? ఓ కోటి రూపాయలకు టర్మ్ పాలసీ తీసుకుని ఉంటే నమ్ముకున్నవాళ్లకు ఇంత ఇబ్బంది కలిగేదా?
ఆత్మీయులు తీవ్ర అనారోగ్యం పాలై మంచం మీద అచేతనంగా పడున్నప్పుడు.. దవాఖాన బిల్లులు కట్టడానికి ఆత్మాభిమానాన్ని చంపుకొని అయినవారినీ కానివారినీ చేబదులు అడుగుతున్నప్పుడు.. ఆరోగ్య బీమా విలువ ఏపాటిదో అర్థం అవుతుంది.
పొరుగువాళ్లు నచ్చక ఒక ఇల్లు, పొరుగువాళ్లకు మనం నచ్చక ఒక ఇల్లు, యజమాని శాడిస్టని ఒక ఇల్లు, యజమాని భార్య గయ్యాళి అని మరో ఇల్లు .. ఎన్ని అడ్రస్‌లు మారుస్తారు? మారిన ప్రతిసారీ సవాలక్ష సామాన్లతో.. భూగోళాన్ని మోస్తున్న అట్లాస్‌ను గుర్తుకుతెస్తాడు మధ్యతరగతి మనిషి. కెరీర్ ఆరంభంలోనే సొంతింటి గురించి ఆలోచిస్తే ఈ ఇబ్బందే ఉండదు.
.. ఇవన్నీ మన ఆర్థిక నిరక్షరాస్యతకు, మనీ అజ్ఞానానికి సాక్ష్యాలు. యాచకుడి నుంచి ఫోర్బ్స్ కుబేరుడి వరకూ ఎవరి స్థాయిలో వారు సంపాదిస్తారు. ఆ సంపాదించిన డబ్బును సమర్థంగా నిర్వహించుకోవడంలోనే మనిషి తెలివితేటలు దాగుంటాయి. ఇంతకీ మీ మనీ జ్ఞానం ఏ స్థాయిలో ఉంది? ఒక్కసారి పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు బేరీజు వేసుకోండి. ఫలితాలను బట్టి.. మీ ఆర్థిక జీవితాన్ని సరిదిద్దుకోండి.

మీ డేటా జాగ్రత్త!
క్రైమ్ రికార్డ్స్‌లో ఆర్థిక నేరాలదే అగ్రస్థానం. ఆర్థిక అలవాట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ పాస్ వర్డ్‌ను జాగ్రత్త పరచడంలో ఏ చిన్న తేడా వచ్చినా.. ఫైనాన్షియల్‌గా మీరు ఫెయిల్ అయిపోతారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఆన్లైన్ ఫ్రాడ్ రూపంలో చేతులు మారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందులో మహా అయితే ఒక్కశాతమే వెనక్కి వచ్చింది. కాబట్టి, కనీసం ఆరు నెలలకు ఒకసారి ఏటీఎం పిన్ మారుస్తూ ఉండాలి.’
స్టార్ట్ ఎర్లీ..
ప్రతి పర్సనల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ చెప్పే మాట ఇదే. ‘చక్రవడ్డీ అనేది ప్రపంచంలో ఎనిమిదో వింత’ అంటారు ఆర్థిక నిపుణులు. పాతికేండ్ల యువకుడు నెలకు పదివేల చొప్పున ఇరవై ఏండ్లపాటు పొదుపు చేయగలిగితే.. నలభై అయిదేండ్లు వచ్చేసరికి పన్నెండుశాతం రాబడితో ఆ మొత్తం కోటి రూపాయలు అవుతుంది. అదే ముప్పై అయిదేండ్లకు మొదలు పెడితే నలభై అయిదు వచ్చేసరికి ఆ మొత్తం ఇరవై మూడు లక్షలకు చేరుకోవడమూ గగనమే. పాతికేండ్లకు మొదలుపెట్టి ముప్పై ఏండ్ల పాటూ ఆ పొదుపు ఉద్యమాన్ని కొనసాగిస్తే.. యాభై అయిదో పుట్టినరోజు నాటికి మీ చేతిలో మూడున్నర కోట్ల రూపాయలు ఉంటాయి. కాబట్టి, పొదుపు-మదుపు తొలిజీతంతోనే ఆరంభం కావాలి.
అసెట్ అలకేషన్
మన పెట్టుబడులలో దేన్ని, ఎంత భాగం, ఏ మార్గంలో ఇన్వెస్ట్ చేశామన్నది తెలియజేయడానికి అసెట్ అలకేషన్ అనే మాట వాడతారు. సంప్రదాయంగా బ్యాలెన్స్డ్ పోర్ట్‌ఫోలియో అనేది.. యాభైశాతం ఈక్విటీ, ముప్పై శాతం బాండ్లు, ఇరవై శాతం బంగారాన్ని కలిగి ఉంటుంది. ఇదీ మన అసెట్ అలకేషన్ అన్నమాట. ఇందులో సాధ్యమైనంత వైవిధ్యం ఉండాలి. అప్పుడే అసలు భద్రంగా ఉంటుంది. ఒకచోట నష్టపోయినా, రెండుచోట్ల లాభపడతాం. రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి, భవిష్యత్ అవసరాలను బట్టి అలకేషన్ వ్యూహాలు మారుతూ ఉంటాయి.





మీరెక్కడ?.. మీ స్కోరెంత?
(ఐదు పరీక్షలూ కలిపి 375 మార్కులకు)
0-125
ఆరంభం బాగానే ఉంది. కానీ సాధించాల్సింది చాలా ఉంది. జాగ్రత్తగా అడుగులు వేయండి.
130-275
మీకంటూ కొన్ని కలలు ఉన్నాయి. వాటిని నిజం చేసుకోవాలనే తపన కూడా ఉంది. కానీ ఆ దిశగా మరింత వేగంగా అడుగులు పడాలి.
280-345
బాగుంది. మీ ప్రణాళికలు బావున్నాయి. ఆచరణ బావుంది. కాకపోతే అక్కడక్కడా అవరోధాలు కనిపిస్తున్నాయి. వాటిని సమర్థంగా దాటుకుని వెళ్తే చాలు. లక్ష్యాన్ని చేరుకుంటారు.
350
..లేదా అంతకంటే ఎక్కువైతే సూపర్. ఈ పరీక్షలో మీరు ఘన విజయం సాధించారు. మీరొక ఆర్థిక యోధుడు. ఇదే క్రమశిక్షణతో ప్రయాణం సాగించండి.
Read More :
Personal Finance Tips | ఫిక్స్డ్ డిపాజిట్లపై లోన్లు తీసుకుంటే లాభమా? నష్టమా?”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

