Akram Khan | సంప్రదాయ కథక్ నృత్యానికి ప్రాణం పోస్తున్న బెంగాలీ కుర్రాడు
Akram Khan | బెంగాలీ కుర్రాడు. సౌత్ లండన్‌లో భారతీయ సంప్రదాయ నృత్యం నేర్చుకున్నాడు. బ్రిటిష్ థియేటర్ ఆర్ట్ డైరెక్టర్‌తో కలిసి ఫ్రాన్స్‌లో తిరిగాడు. బ్రసెల్స్‌లో చదివాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోల్‌మాడల్‌గా నిలిచాడు. అతని పేరు అక్రమ్ ఖాన్.
Akram Khan | బెంగాలీ కుర్రాడు. సౌత్ లండన్‌లో భారతీయ సంప్రదాయ నృత్యం నేర్చుకున్నాడు. బ్రిటిష్ థియేటర్ ఆర్ట్ డైరెక్టర్‌తో కలిసి ఫ్రాన్స్‌లో తిరిగాడు. బ్రసెల్స్‌లో చదివాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోల్‌మాడల్‌గా నిలిచాడు. అతని పేరు అక్రమ్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా కథక్ ప్రదర్శనలిస్తూ.. తన అభిమాన నృత్యాన్ని విశ్వమంతా విస్తరిస్తున్నాడు.

కన్నవారు నేటి బంగ్లాదేశ్‌లో పుట్టిన భారతీయులు. తల్లి శాస్త్రీయ నృత్యకారిణి. మన కథక్ కథానాయకుడు అక్రమ్ ఖాన్ సౌత్ లండన్‌లో పుట్టాడు. ఏడేండ్ల వయసులోనే తల్లి ద్వారా బెంగాలీ జానపద నృత్యం పరిచయమైంది. ప్రతాప్ పవార్ అనే గురువు దగ్గర కథక్‌లో మెలకువలు తెలుసుకున్నాడు. పాఠాలు, హోమ్‌వర్క్‌లు, పనిష్మెంట్లు ఆ పసివాడిని బెదరగొట్టేవి. బడికి వెళ్లాలంటేనే భయంగా ఉండేది. దీంతో స్కూల్‌బస్ ఎక్కకుండా.. వెనక్కి వచ్చేసి గ్యారేజ్‌లో కథక్ సాధన చేసేవాడు. తొలి ప్రదర్శనలోనే ప్రముఖ దర్శకుడు పీటర్ బ్రూక్ దృష్టిలో పడ్డాడు. ఆ సమయంలో బ్రూక్ మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఖాన్‌కు ఒక చిక్కుప్రశ్న ఎదురైంది. డిగ్రీ పూర్తి చేయడమా? డ్యాన్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవడమా?.. ఏ నిర్ణయమూ తీసుకోలేనంత డైలమాలో పడ్డాడు. చివరికి ధైర్యం చేసి, డ్యాన్స్వైపే మొగ్గాడు. లీసెస్టర్ మాంట్‌ఫోర్ట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచాడు. కథక్‌లో అనేక ప్రయోగాలు చేశాడు.

మలుపు తిరిగిన కథ..
కెరీర్లో ఒక అడుగు ముందుకుపడింది అనుకున్నప్పుడు ఎవరైనా ముందుకే వెళ్తారు. ఎంత కష్టమైనా భరించి ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. అక్రమ్ ఖాన్ తీసుకున్న నిర్ణయం ఇందుకు భిన్నం. ఏకంగా ‘అక్రమ్ ఖాన్ కంపెనీ’ పేరుతో సొంత డ్యాన్స్ ట్రూప్ ఏర్పాటు చేశాడు. రెండు సంవత్సరాల్లోనే మంచి పేరు వచ్చింది. అంతర్జాతీయ ప్రదర్శనలిచ్చాడు. అవార్డులు అందుకున్నాడు. తన కంపెనీని విజయవంతంగా కొనసాగిస్తూనే.. కథక్‌లో సోలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. ఏడాదిలో ఒక్కరోజు కూడా ఖాళీ లేనంతగా బిజీ అయిపోయాడు. గురువు ప్రతాప్ పవార్ కూడా.. ‘నా శిష్యుడు నాకంటే గొప్ప డ్యాన్సర్’ అని కితాబిచ్చాడు. ఇప్పుడు అక్రమ్ ఖాన్ కంపెనీ (ఏకేసీ)లో ప్రముఖ నిర్మాత ఫారుక్ చౌదరి సహ- భాగస్వామి. మ్యూజిక్ కంపోజర్ నితిన్ సానే సైతం ఖాన్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఖాన్ దక్షిణాఫ్రికా ఫేమస్ డ్యాన్సర్ షానెల్ విన్లాక్ను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అతని కంపెనీలో ఆమె స్టాండింగ్ మెంబర్ కూడా. ‘మన మూలాలు ఏమిటి? వాటికి మనం చేసింది ఏమిటి? గొప్ప విషయాల్ని చాలా గొప్పగా ప్రచారం చేయాలి. ఆ గొప్పదనాన్ని మరింత పెంచాలి. ఇంకొంత విస్తరించాలి. నా పరిధిలో భారతీయ సంప్రదాయ నృత్యం కథక్ కోసం అదే చేశాను. ఇంకా చేసేందుకు ప్రయత్నిస్తాను’ అంటున్నాడు అక్రమ్. తన కొరియోగ్రఫీతో పురాతన సంప్రదాయ నృత్య భంగిమలకు సమకాలీనత జోడిస్తాడు అతను. ‘ఇప్పటికీ నేను సిగ్గరినే. కాకపోతే.. నేను మాట్లాడకపోయినా నా శరీరం మాట్లాడుతుంది’ అంటాడు ఖాన్.

‘సంప్రదాయ నృత్యాన్ని బతికించుకోవాలంటే ఒకటే దారి. దానికి ఆధునికతను అద్దాలి. నేటితరానికి మరింత దగ్గర కావాలి’ అన్నది తన అభిప్రాయం. ఖాన్ నృత్య రూపకాల్లో సామాజిక కోణాలు, మానసిక సంఘర్షణలు ఉంటాయి. ఆ ఇతివృత్తాలు కదిలిస్తాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి. కొన్నిసార్లు ఉద్వేగానికీ గురిచేస్తాయి. ‘కళ బాధ్యతే అది. కళలోని పదును కూడా అదే’ అంటు న్నప్పుడు ఆ నృత్యకారుడి చేతులు ఆవేశంతో బిగుసుకుపోతాయి. ‘భారత్‌లో ప్రదర్శన ఇవ్వడం మంచి అనుభవం. మనవాళ్లు ప్రదర్శన తిలకిస్తూ తన్మయంతో తాళం వేసే దృశ్యం బావుంటుంది’ అని వివరిస్తాడు అక్రమ్ ఖాన్.

“మనుషులే కాదు.. ప్రస్తుతం జంతుజాలమూ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. భూగోళం మొత్తం ఓ మహా విపత్తుకు చేరువ అవుతున్నది. మన మూలాల్ని, మన గ్రహాన్ని మనం నిర్లక్ష్యం చేయడమే దీనికి కారణం. తీసుకోవడమే కానీ, ఇవ్వడం తెలియదు మనకు. ‘జంగిల్ బుక్’ పేరుతో మేం రూపొందిస్తున్న నృత్య రూపక సారాంశం కూడా ఇదే. మారి తేనే మనకు మనుగడ. లేకపోతే..”
– ఖాన్
Read More :
“రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Akram Khan
- Dance
- inspiration
- kathak
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

