IPL 2023: KKR vs PBKS.. కోల్‌కతా నిలవాలంటే గెలవాల్సిందే..!
IPLలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు కోల్ కత్తా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ లో పంజాబ్ తో తలపడనుంది. కోల్ కత్తా టోర్నీలో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.
ఐపీఎల్ (IPL)లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు కోల్‌కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ తో తలపడనుంది. కోల్‌కతా టోర్నీలో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.
కేకేఆర్ (KKR) సొంతగడ్డపై ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడిపోయింది. కరోనా తర్వాత సొంత మైదానాల్లో మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఓ వైపు భారీ స్కోర్లు చేస్తున్నప్పటికీ కేకేఆర్ ఓడిపోతోంది. సునీల్ నరైన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. గత 7 మ్యాచుల్లో కేవలం 1వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఈ రోజు మ్యాచ్ లో నరైన్ స్థానంలో డేవిడ్ వీస ఆడే అవకాశం ఉంది. మరోవైపు రస్సెల్ కుడిచేతివాటం లెగ్ స్పిన్‌లో ఇబ్బంది పడుతున్నాడు. రస్సెల్ మునుపటి ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది.
కోల్‌కతా జట్టు (అంచనా): గుర్బాజ్(Wk), జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా(C) , రస్సెల్, రింకు సింగ్, నరైన్/డేవిడ్ వీస, శార్దూల్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
మరోవైపు పంజాబ్ కింగ్స్ టోర్నీలో పడుతూ లేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే గత నాలుగు మ్యాచుల్లో 200పైగా రన్స్ కొట్టి IPLలో వరసగా నాలుగు సార్లు 200పైగా రన్స్ కొట్టిన టీంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో కూడా మరోసారి భారీ స్కోర్ సాధించాలని చూస్తోంది. అయితే పంజాబ్ ను బౌలింగ్ సమస్య వేధిస్తోంది. గత నాలుగు మ్యాచుల్లో బౌలర్లు 200పైగా రన్స్ సమర్పించుకున్నారు. బౌలింగ్ ని మెరుగుపరుచుకుంటే పంజాబ్ గెలుపు ఖాయం.
PBK Team (అంచనా): ప్రభ్ సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్(C), మాథ్యూ షార్ట్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ(Wk), సామ్ కరన్, షారుఖ్ ఖాన్, హర్ ప్రీత్ బ్రార్, రిషీ ధావన్, రాహుల్ చాహర్, అర్షదీప్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Court | లోతుకుంట భూములపై స్టేటస్కో తొలగింపు
Gold Smuggling | పసిడికి సుంకాల సెగ.. దేశంలో భారీగా పెరిగిన బంగారం స్మగ్లింగ్!
IND vs NZ ODI | టాస్ గెలిచిన భారత్.. కివీస్‌కు బ్యాటింగ్.. టీమిండియా తుది జట్టు ఇదే!
SIR | ఆధార్‌కు బదులు ఓటర్ ఐడీ.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్ ఎసరు?
Walking | ట్రెడ్‌మిల్‌పై నడవడమా? పార్కుల్లో వాకింగా? ఏది బెటర్?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

