టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి సర్కారు వారి పాట (Sarkaru Vaari Pata). మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తుండగా..కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే విడుదలైన తొలి పాట కళావతి అందరి మనసు దోచుకుంటోంది. కేవలం కొద్ది టైంలోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సాధించింది. ఈ పాటలో మహేశ్ వేసిన హుక్ స్టెప్పులు ఓ రేంజ్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే ఇవే స్టెప్పులను హీరోయిన్ కీర్తిసురేశ్ వేసి అదరహో అనిపిస్తోంది.
కళావతి (సాంగ్ టైటిల్ రోల్) స్వయంగా తన పాటకు ట్రెండీ డ్రెస్లో డ్యాన్స్ చేస్తూ..సినిమాలోని సీన్ ను రీక్రియేట్ చేసింది. #kalaavathichallenge హ్యాష్ ట్యాగ్ తో ఛాలెంజ్ కూడా విసిరింది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ సూపర్ స్టెప్పులు నెటిజన్లు చాలా మంది ట్రై చేస్తూ సందడి చేస్తున్నారు. పరశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.
కీర్తిసురేశ్ మరోవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్లో నటిస్తోంది. ఈ మూవీలో చిరు సోదరి పాత్రలో కనిపించనుంది. దీంతోపాటు తమిళంలో సానికాయిధమ్, మలయాళంలో వాశి చిత్రాల్లో నటిస్తోంది.