Karnataka | కాంగ్రెస్‌ను నమ్మి మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. కర్ణాటక రైతన్నల రిక్వెస్ట్
Karnataka | కర్ణాటకలో ఎడాపెడా విధిస్తున్న విద్యుత్తు కోతలతో సామాన్యులు, రైతులు అల్లాడిపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడువకముందే కన్నడ నేలను అంధకారంలోకి నెట్టేసిన కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేసి రోడ్లెక్కుతున్నారు.
Karnataka | కర్ణాటకలో ఎడాపెడా విధిస్తున్న విద్యుత్తు కోతలతో సామాన్యులు, రైతులు అల్లాడిపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడువకముందే కన్నడ నేలను అంధకారంలోకి నెట్టేసిన కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేసి రోడ్లెక్కుతున్నారు. రైతన్నల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో.. మాకు కరెంటు ఇస్తారా? లేదా? అంటూ ఓ సబ్‌స్టేషన్‌లో మొసలిని వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా కాంగ్రెస్‌ను నమ్మి అధికారం అప్పగించి నట్టేట మునిగామని గ్రహించిన కర్ణాటక రైతన్నలు.. హస్తం పార్టీని నమ్మి మరెవరూ మోసపోవద్దని ప్రచారం మొదలుపెట్టారు.
కాంగ్రెస్‌ను నమ్మి తమలా మరెవరూ మోసపోవద్దని త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో గద్వాలకు వచ్చి ప్రచారం నిర్వహించారు. కరెంటు లేక మా పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ చేతిలో మేం మోసపోయాం.. మీరు మోసపోకండి అని తెలంగాణ రైతన్నలు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో కాంగ్రెస్ ఓటు వేయవద్దని రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. pic.twitter.com/19opoOSNMp
— Namasthe Telangana (@ntdailyonline) October 24, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసు బృందాలు!
Ranabaali | ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘రణబాలి’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్.. కొడుకు కోసం రాంప్రసాద్ తల్లి స్పెషల్ టీ, సుధీర్ తల్లి కన్నీళ్లు!
R&B Department | రిటైర్డ్ అయినా తగ్గని పెత్తనం.. ఆర్ అండ్ బీలో రూ.20 వేల కోట్ల పనులపై పాత అధికారుల ఆధిపత్యం?
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

