Nipah Virus | అక్టోబర్ దాకా కేరళకు వెళ్లొద్దు.. ప్రజలకు కర్ణాటక సూచన!
Nipah Virus | అక్టోబర్ దాకా కేరళ వెళ్లొద్దు.. ప్రజలకు కర్ణాటక సూచన! | కేరళలో ఓ వైపు కరోనా, మరో వైపు నిపా వైరస్ వణికిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే నిపా వైరస్‌తో 12 సంవత్సరాల బాలుడు మృతి చెందగా.. 68 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పొరుగున కర్ణాటక

బెంగళూరు : కేరళను ఓ వైపు కరోనా, మరో వైపు నిపా వైరస్ వణికిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే నిపా వైరస్‌తో 12 సంవత్సరాల బాలుడు మృతి చెందగా.. 68 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పొరుగున కర్ణాటక అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు అత్యవసరమైతే తప్పా అక్టోబర్ వరకు కేరళ వెళ్లడం మానుకోవాలని అధికారులు సూచించారు. అలాగే అన్ని కళాశాలలు, పాఠశాలలు, విద్యా సంస్థల్లో విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరు కావొద్దన్నారు.
జిల్లాలో వైరస్ నియంత్రణకు పరిశ్రమలు సైతం అక్టోబర్ వరకు వర్క్‌ఫ్రం హోమ్ కొనసాగించాలని చెప్పారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తి నివారణకు అడ్వైజరీని సైతం జారీ చేసింది. జ్వరం, మారిన మానసిక స్థితి, తీవ్రమైన బలహీనత, తలనొప్పి, శ్వాసకోశ ఇబ్బంది, దగ్గు, వాంతులు, కండరాల నొప్పి, మూర్ఛ, విరేచనాలు వంటి లక్షణాలతో కేరళ నుంచి వచ్చే వారిని పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

