కన్నడ అగ్రహీరో సుదీప్ నటించిన చిత్రం ‘కోటిగొబ్బ-3’. శివకార్తీక్ దర్శకుడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం కన్నడంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని ‘కే3-కోటికొక్కడు’ పేరుతో తెలుగులోకి అనువదిస్తూ ఫిబ్రవరి4న విడుదల చేయబోతున్నారు. ‘కన్నడనాట సుదీప్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిది. ఇందులో ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. యాక్షన్, సెంటిమెంట్ అంశాలు ప్రధానంగా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటాయి. సుదీప్‌కు జోడీగా మడోన్నా సెబాస్టియన్ అలరిస్తుంది. రొమాంచితమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతినందిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. శ్రద్ధాదాస్, అఫ్తాబ్ శివ దాసాని, రవిశంకర్, నవాబ్షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శేఖర్‌చంద్ర, సంగీతం: అర్జున్జెన్యా, నిర్మాణ సంస్థ: గుడ్ సినిమా గ్రూప్, నిర్మాత: శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే.