NTR New Look Viral | దేవర, వార్ 2 సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). అయితే తారక్ తన సినిమా సినిమాకి లుక్‌ని మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల అభిరుచులకు అనుగుణంగా ప్రతి సినిమాకి మేకోవర్ మార్చుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఇప్పటికే వార్ 2 కోసం ప్రత్యేక లుక్‌లో కనిపించిన ఉన్న తారక్.. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో రాబోతున్న డ్రాగన్ ప్రాజెక్ట్ కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ ఎవరు ఉహించని లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ స్టైలిష్ క్రాఫ్, గడ్డం, గాగుల్స్ తో బ్లూ జీన్స్ ట్రౌజర్ వేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి వెళుతుండగా కెమెరాకు ఫోజులిచ్చాడు తారక్. కాగా ఇందుకు సంబంధించిన లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రశాంత్ నీల్ డ్రాగన్ ప్రాజెక్ట్ కోసమే తారక్ ఇంత కష్టపడుతున్నాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.