టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్న జో రూట్
లండన్: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి జో రూట్ తప్పుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో సారథిగా జో రూట్ విఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు రూట్ తెలిపాడు. 2017లో అలిస్టర్ కుక్ వారసుడిగా జో రూట్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు గెలిపించిన రికార్డు జో రూట్ పేరిట నమోదైంది. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టెస్టులోనూ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. వరుసగా ఇంగ్లండ్ 9 మ్యాచ్‌లు ఓడింది. తన కెరీర్లో ఇది చాలా సవాల్‌తో కూడిన నిర్ణయమని, తన ఫ్యామిలీతో పాటు సన్నిహితులతో చర్చించిన తర్వాత, కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని నిర్ణయించినట్లు రూట్ తెలిపాడు. దేశానికి సారథ్యం వహించడం గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పాడు. టెస్టు కెప్టెన్‌గా జో రూట్ 5,295 రన్స్ చేశాడు. కెప్టెన్‌గా 14 సెంచరీలు నమోదు చేశాడు. 64 టెస్టులకు కెప్టెన్సీ చేపట్టగా, దాంట్లో 27 మ్యాచుల్లో గెలవగా, 26 మ్యాచుల్లో ఓడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

