చైనా నుంచి రక్షణకు జపాన్ సైనిక విన్యాసాలు
చైనా మారుమూల ద్వీపాలను ఆక్రమించకుండా నిరోధించడానికి జపాన్ ఆత్మరక్షణ దళాలు ఆదివారం సైనిక విన్యాసాలు నిర్వహించాయి. షిజుకాలోని తూర్పు ఫుజి శిక్షణా ప్రాంతంలో జపాన్ ఈ వ్యాయామం చేపట్టింది.

టోక్యో : చైనా మారుమూల ద్వీపాలను ఆక్రమించకుండా నిరోధించడానికి జపాన్ ఆత్మరక్షణ దళాలు ఆదివారం సైనిక విన్యాసాలు నిర్వహించాయి. షిజుకాలోని తూర్పు ఫుజి శిక్షణా ప్రాంతంలో జపాన్ ఈ వ్యాయామం చేపట్టింది. తూర్పు చైనా సముద్రంలో చైనా పెరుగుతున్న దూకుడును జపాన్ నిరంతరం జాగ్రత్తగా గమనిస్తున్నది. జపాన్ పాలిత సెంకాకు దీవులను కూడా తమవిగా చైనా పేర్కొంటున్న నేపథ్యంలో చైనా నుంచి తమ దీవులను రక్షించుకునేదుకు జపాన్ ఈ సైనిక విన్యాసాలు చేపట్టింది. నాన్సీ ద్వీపాన్ని రక్షించే సామర్థ్యాన్ని కూడా జపాన్ పెంచుకుంటున్నది.
జపాన్ టైమ్స్ నివేదికల ప్రకారం, దాదాపు రెండు గంటలపాటు నిర్వహించిన విన్యాసాల్లో 3,100 మంది జపనీస్ సైనికులు, 45 ట్యాంకులు, సాయుధ వాహనాలు పాల్గొన్నాయి. వీటితోపాటు పోరాట హెలికాప్టర్లు కూడా పాలుపంచుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రజలు సైనిక విన్యాసాలు తిలకించకుండా అడ్డుకున్నారు.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జపాన్ రక్షణ చీఫ్ నోబువో కిషి జారీ చేసిన ప్రకటనను విమర్శించింది. తైవాన్ సమీపంలోని నాన్సీ ద్వీపం ఆందోళన కలిగించే విషయమని నోబువో కిషి అభివర్ణించగా.. చైనా తన భూములను కాపాడుకుంటున్నదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు.
గతంలో జపాన్ ఆక్రమిత సెంకాకు దీవులపై ల్యాండ్‌స్కేప్ సర్వేను చైనా చేపట్టింది. చైనా దీనిని తన డియోయు ద్వీపం అని పిలుస్తుంది. చైనా సహజ వనరుల విభాగం సెంకాకుతో పాటు మరో రెండు ద్వీపాలను సర్వే చేసినప్పటి నుంచి చైనా దూకుడును జపాన్ అంచనా వేస్తూ వస్తున్నది. ఈ ద్వీపాన్ని జపాన్ ఆక్రమించినప్పటికీ, చైనా తన అధికారాన్ని నొక్కి చెప్తూనే ఉన్నది.
ఇవి కూడా చదవండి..
జెరూసలెంలో తెరుచుకున్న మౌంట్ హోలీ టెంపుల్
ఖలీస్తాన్ టైగర్ ఫోర్స్‌తో సంబంధమున్న ఇద్దరు అరెస్ట్
అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం.. తాజాగా వీడియో బయటకు
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
ఎక్కువ జిగురు కోసం చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు..
నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ డొమినోజ్ డాటా లీక్..!
సెప్టెంబర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
టిబెట్‌ను ఆక్రమించిన చైనా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

