Janhvi Kapoor | సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా తన అందచందాలతో కుర్ర హృదయాలు దోచుకుంది జాన్వీ కపూర్. శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇప్పుడు జాన్వీ కపూర్ పేరు చెబితే టాలీవుడ్, బాలీవుడ్‌లోను కుర్రాళ్లకి కంటిపై కునుకు ఉండదు. అంతలా తన అందాలతో మంత్ర ముగ్ధులని చేసింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు క్రేజ్ దక్కించుకుంది. జాన్వీని స్టార్ హీరోయిన్గా చూడాలని శ్రీదేవి ఎన్నో కలలు కంది. కాని ఆ కోరిక తీరకుండానే కన్నుమూసింది.
జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన ‘ధడక్’ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ చిత్రం కూడా పెద్ద హిట్ కాలేదు. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టాలీవుడ్‌కి దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఈ సినిమా హిట్ కావడంతో టాలీవుడ్లో క్రేజ్ పీక్స్‌కి వెళ్లింది. ఇప్పుడు రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాలో కథానాయికగా నటిస్తుంది. అయితే తన అందాలతో అందరిని అట్రాక్ట్ చేయడంలో జాన్వీ కపూర్ ముందు ఉంటుంది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ 2025 లో జాన్వీ అందరి కళ్లు తనపైన ఉండేలా చూసుకుంది.
అద్భుతమైన కాస్ట్యూమ్స్ లో జాన్వీ షో స్టాపర్ గా నిలిచింది. ర్యాంప్ పై అదిరిపోయే క్యాట్ వాక్ తో దూసుకొచ్చిన జాన్వీ వెంటపడి మరీ ఫోటోగ్రాఫర్లు పిచ్చెక్కి ఫోటోలు తీసారు.ప్రొఫెషనల్ మోడల్స్ కు తీసిపోని రీతిలో ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ… ట్రెండీ అవుట్ ఫిట్ లో జిగేల్ అనిపించింది. ర్యాంప్ పై జాన్వీ సోయగాలు నెట్టింట కుర్రకారును గిలిగింతలు పెడుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తూ అందరి దృష్టి తనపై ఉండేలా చూసుకుంటుంది. చీర కట్టిన, స్కర్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తుంది.
Damn #JanhviKapoor 🥵🔥 pic.twitter.com/yKNutIHEkf
— 𝘔𝘜𝘡𝘡 (@MushtieQ) March 29, 2025