మలక్పేట: మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వంతెనను ప్రారంభించి వెళ్లగానే, పెద్దసంఖ్యలో బ్రిడ్జిపైకి చేరుకున్న ప్రజలు.. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో వరదలతో మూసారాంబాగ్-అంబర్పేట బ్రిడ్జి ముంపునకు గురై, రాకపోకలు నిలిచిపోయి..ప్రజలు పడే ఇబ్బందులను గమనించిన అప్పటి సీఎం కేసీఆర్, బ్రిడ్జి నిర్మాణానికి రూ.52 కోట్ల నిధులు మంజూరు చేయగా, అప్పటి మంత్రి కేటీఆర్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు.
ఏడాదిలోపుగా(2025లోపుగా) బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కాంట్రాక్టర్ను ఆదేశించారన్నారు. ఏడాదిలోగా పూర్తి చేయాల్సిన బ్రిడ్జి నిర్మాణం.. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రెండున్నరేండ్లు పట్టిందన్నారు.