నాకూ అధికారాలివ్వండి!
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉన్నది ఆయిల్‌ఫెడ్‌లోని ఓ అధికారి తీరు. ఉద్యోగ విరమణ పొంది కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న సదరు అధికారి మొత్తం అధికారాల కోసం పట్టుపడుతుండడం గమనార్హం. రెగ్యులర్ అధికారి మాదిరిగానే ఇప్పుడు కూడా అన్ని అధికారాలను ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు.
- చర్చనీయాంశంగా ఆయిల్‌ఫెడ్ రిటైర్డ్ అధికారి తీరు
- రిటైర్మెంట్ తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో నియామకం
- ఆర్థికపరమైన అధికారాలకు కోత
- నెలలో ముగియనున్న ఎక్స్టెన్షన్
- అయినా తనకు అధికారాలు కావాలంటూ పట్టు
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉన్నది ఆయిల్‌ఫెడ్‌లోని ఓ అధికారి తీరు. ఉద్యోగ విరమణ పొంది కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న సదరు అధికారి మొత్తం అధికారాల కోసం పట్టుపడుతుండడం గమనార్హం. రెగ్యులర్ అధికారి మాదిరిగానే ఇప్పుడు కూడా అన్ని అధికారాలను ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులకు మొరపెట్టుకోగా వారు నిరాకరించడంతో ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్దకే వెళ్లారు. తనకు అధికారాలు కల్పించాలంటూ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. దీంతో అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆయిల్‌ఫెడ్‌లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించిన సుధాకర్‌రెడ్డి మార్చి నెలలో ఉద్యోగ విరమణ పొందారు. మళ్లీ నియామకం కోసం తీవ్రంగా పైరవీలు చేసినట్టు తెలిసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదం తెలుపగా ఆరు నెలలపాటు కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ గడువు కూడా ముగియనున్నది. మరో నెల మాత్రమే ఆయనకు గడువు మిగిలి ఉన్నది. ఆయనను కాంట్రాక్టు పద్ధతిలో నియమించడంతో ఆర్థికపరమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వలేదు. దీనిపై ఆ అధికారి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇతర శాఖల్లో ఇస్తున్నప్పుడు తనకు ఎందుకు ఇవ్వడంలేదంటూ ఉన్నతాధికారులతో వాదిస్తూనే ఉన్నారు.
అయినప్పటికీ ఆయనకు అధికారాలు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ససేమిరా అన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతుండడంతో ఒకవేళ అవకతవకలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందుకనే ఆయనకు ఆర్థికపరమైన అధికారాలు ఇవ్వడంలేదని చెప్తున్నారు. అయినప్పటికీ ఆ అధికారి మాత్రం తన ప్రయత్నాలు ఆపకపోవడం గమనార్హం. గడువు ముగుస్తున్నా.. అధికారాల కోసం ఇంతలా పట్టుపడుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి గడువు పొడగించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మొదటిసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా తన సేవల్ని గుర్తించి, తన అవసరం ఉందని గ్రహించి పిలిచి పట్టుబట్టి మరీ అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెబుతున్నట్టుగా తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

