హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కూకట్పల్లి శివారులోని ఈదులకుంట చెరువు భూముల వ్యవహారంలో తనకు, తన సంస్థలకు, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్ స్పష్టంచేశారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల్లో తన సంస్థకు అంటగడుతూ చేసిన అసత్య ప్రచారాన్ని ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు.
వార్తల్లో పేర్కొన్న కే నవీన్‌కుమార్‌తో తనకెలాంటి సంబంధంలేదని తెలిపారు. పేరు సారూప్యత ఆధారంగా తనకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయంగా బురదజల్లడం మానుకోవాలని హితవుపలికారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన వ్యక్తులు చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు.