Israel-Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి.. అణు స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడి
తమపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడికి ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడింది.
Israel-Iran | జెరూసలేం, ఏప్రిల్ 19: తమపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడికి ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ ఇరాన్ మిలటరీకి ప్రధాన ఎయిర్‌బేస్‌గా కూడా ఉంది. నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని, ఆకాశంలో డ్రోన్లు కన్పించాయని, అయితే అవి దేనికో అర్థం కాలేదని స్థానికులు తెలిపారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉండటంతో ఇరాన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడితో అప్రమత్తమైన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను మోహరించడమే కాక, గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్టు తెలిపింది. తాము జరిపిన దాడుల గురించి ఇజ్రాయెల్ మిలటరీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
గగనతలం మూసివేత..
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లోని గగనతలాన్ని మూసివేశారు. పౌర, వాణిజ్య విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేశారు. కొన్ని విమానాలను దారి మళ్లించగా, మరికొన్నింటిని వేరే విమానాశ్రయాల్లో ల్యాండింగ్ చేశారు. దీంతో ఏం జరుగుతుంతో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. దుబా య్ కేంద్రంగా నడుస్తున్న ఎమిరేట్స్, ఫ్లయ్ దుబాయ్ సంస్థలు ఎలాంటి కారణం వెల్లడించకుండా పశ్చిమ ఇరాన్‌కు వెళ్లాల్సిన విమానాలను దారిమళ్లించాయి. కాగా, మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలపై యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Antony Blinken
- drones
- iran
- Israel
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

