ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్‌లైన్స్

నూతన నిబంధనలను పూర్తిస్థాయిలో అమల్లోకి తేవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలకు 2021 జూన్ 1 వరకు గడువు ఇచ్చింది. అన్ని ఆరోగ్యబీమా పాలసీలకు తమ తాజా నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఐఆర్డీఏఐ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. పాలసీ సర్వీసింగ్‌లో భాగంగా, బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీ గురించి ప్రాథమిక సమాచారాన్ని పాలసీదారులకు తెలియజేయాలి. వాటిలో పాలసీ సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం బీమా, కవరేజీ పరిధి, పాలసీ పరిధిలో ఉన్న బీమా వ్యక్తుల సంఖ్య, పాలసీ వ్యవధి, సెటిల్ చేసిన క్లెయిమ్‌ల మొత్తం, మిగతా బీమా హామీ, బోనస్ ఏదైనా ఉంటే దాని వివరాలు పాలసీదారునికి అందించాలి.
సమాచారం పునరుద్ధరణ, ప్రీమియం చెల్లింపు వ్యవధి, పునరుద్ధరణకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం, గ్రేస్ పీరియడ్, సంప్రదింపు వివరాలు, బీమా సంస్థ, పాలసీదారు సంబంధిత సేవ, టోల్ ఫ్రీ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీ వంటివి చేర్చాలి. పాలసీదారులకు సంవత్సరానికి రెండుసార్లు సమాచారం ఇవ్వాలి. అంటే పాలసీ జారీచేసిన ఆరు నెలల తరువాత, పునరుద్ధరణ గడువు తేదీకి కనీసం ఒక నెల ముందు ఈ వివరాలు తెలియజేయాలి. అయితే మల్టీ ఇయర్ పాలసీ విషయంలో, పాలసీ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల వ్యవధిలో సమాచారాన్ని పంచుకోవచ్చు.
ఆరోగ్య బీమా పాలసీ కింద ఏదైనా క్లెయిమ్ పరిష్కారం అయిన సందర్భంలో, బీమా మొత్తానికి సంబంధించిన వివరాలతో పాటు అందుబాటులో ఉన్న సంచిత బోనస్ ఏదైనా ఉంటే పాలసీదారునికి తెలియజేయాలి. క్లెయిమ్‌ను పరిష్కరించిన 15 రోజుల్లోపు పాలసీదారులకు సమాచారం ఇవ్వాలి. ఐఆర్డీఏఐ సర్క్యులర్ ప్రకారం బీమా సంస్థ పాలసీదారునికి సమాచారం తెలియజేయడానికి ఏదైనా కమ్యూనికేషన్ పద్ధతిని ఎంచుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

