Iran Crisis: 45 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదన.. ఇంకా స్పందించని ఇరాన్, అమెరికా
Iran Crisis: ఇరాన్ వార్‌ను ఆపేందుకు మీడియేటర్లు ఓ ప్లాన్ వేశారు. 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించాలని ముస్తాయి తీర్మానం ప్రతిపాదించారు అయితే ఇరాన్, అమెరికా దేశాలు ఆ ప్లాన్‌పై ఇంకా స్పందించలేదు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ .. ఇరాన్, అమెరికా మధ్యవర్తులతో చర్చించినట్లు తెలుస్తోంది.
కైరో: పశ్చిమాసియా సంక్షోభాన్ని(Iran Crisis) ఆపేందుకు ఈజిప్ట్, పాకిస్థాన్, టర్కీ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడిని ఆపేందుకు ఆ దేశాలు ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ప్లాన్‌ను రెఢీ చేసినట్లు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి రీఓపెనింగ్ అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధానికి బ్రేక్ వేయాలంటే, 45 రోజల పాటు కాల్పుల విరమణ పాటించాలని పశ్చిమాసియా అధికారులు వెల్లడించారు. శాశ్వతమైన కాల్పుల విరమణ జరగాలంటే, తొలుత ఇరాన్, అమెరికా దేశాలు 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకారం తెలుపాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఇరాన్, అమెరికా మాత్రం ఇంత వరకు ఈ ప్రతిపాదనపై ప్రకటన చేయలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి, పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్కు కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన అందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా అంగీకరిస్తాయా లేదా అన్న అంశంపై క్లారిటీ లేదు. అయితే ఆర్థిక నష్టాన్ని కల్పించే వరకు, మరోసారి దాడి చేయబోమని హామీ ఇచ్చే వరకు వెనుకడుగు వేసేది లేదని ఇరాన్ చెబుతోంది. ఇక ట్రంప్ మాత్రం తన వార్నింగ్‌లను జారీ చేస్తూనే ఉన్నారు. హోర్ముజ్ నుంచి ఇరాన్ తప్పుకోకుంటే, ఇరానీ బ్రిడ్జ్‌లు, విద్యుత్తు స్టేషన్లను పేల్చివేస్తానని బెదిరించారు. యాక్సియోస్ వెబ్సైట్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనకు చెందిన సమాచారం రిలీజైంది.
ప్రతిపాదిత ఒప్పందంపై సోమవారం ఓ అగ్రిమెంట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. రెండు దశల్లో ఈ డీల్ జరగనున్నది. తొలుతు సీజ్ఫైర్ ఆ తర్వాత తుది అగ్రిమెంట్ ఉంటుంది. కాల్పుల విరమణ సమయంలో హోర్ముజ్ జలసంధిని తక్షణమే తెరుస్తారు. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మరో 20 రోజుల్లోగా ఫైనల్ డీల్ కుదరనున్నది. పాకిస్థాన్ ఈ దౌత్యంలో కీలక పాత్ర పోషిస్తున్నది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్.. నిన్న రాత్రి మొత్తం ఈ డీల్ అంశంపై వర్కౌట్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు ప్రత్యేక దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరగాచితో ఆయన ముచ్చటించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

