IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ 70వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన గుజరాత్ మరో విజయంపై కన్నేసింది. ఆర్సీబీకి మాత్రం ఇది చావోరేవో లాంటి మ్యాచ్. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ, ఫిఫ్టీ బాదిన డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ చెలరేగితే ఆర్సీబీకి ఎదురుండదు. అయితే.. గుజరాత్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. దాంతో, ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ చేరాలనే పట్టుదలతో బెంగళూరు ఉంది. మరి ఈ మ్యాచ్‌లో గెలిచేది ఎవరో మరికొన్ని గంట్లలో తేలనుంది.
ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్(53) హాఫ్ సెంచరీ బాదాడు. హర్షల్ పటేల్ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ సాధించాడు. 29 బంతుల్ఓ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో అతను 50 రన్స్ కొట్టాడు. విజయ్ శంకర్(32)క్రీజులో ఉన్నాడు. 12 ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 109/1
హిమాన్షు శర్మ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్(40) ఫోర్, సిక్స్ బాదాడు. దాంతో రెండో వికెట్‌కు విజయ్ శంకర్(21)తో 59 రన్స్ జోడించాడు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 84/1
విజయ్ కుమార్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్(28) సిక్స్ బాదాడు. విజయ్ శంకర్(21)క్రీజులో ఉన్నాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 71/1
శుభ్‌మన్ గిల్(18), విజయ్ శంకర్(16) వేగం పెంచారు. వేన్ పార్నెల్ ఓవర్లో గిల్ ఫోర్, శంకర్ వరసగా సిక్స్, ఫోర్ బాదారు. 6 ఓవర్లకు స్కోర్.. 51/1
ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. దాంతో గుజరాత్ స్కోర్ వేగం తగ్గింది. 5 ఓవర్లకు వికెట్ నష్టానికి 35 రన్స్ చేసింది. శుభ్‌మన్ గిల్(13), విజయ్ శంకర్(5) క్రీజులో ఉన్నారు.
సిరాజ్ తొలి వికెట్ తీశాడు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(12)ను ఔట్ చేశాడు. ఎల్బీ అప్పీల్ నుంచి తప్పించుకున్న సాహా ఆఖరి బంతికి పార్నెల్ చేతికి చిక్కాడు. శుభ్‌మన్ గిల్(8) క్రీజులో ఉన్నాడు. 3 ఓవర్లకు స్కోర్.. 25/1
వేన్ పార్నెల్ ఓవర్లో వృద్ధిమాన్ సాహా(6) ఒకటి, శుభ్‌మన్ గిల్(8) రెండు బౌండరీలు బాదారు. 2 ఓవర్లకు స్కోర్.. 15/0
సిరాజ్ వేసిన తొలి ఓవర్లో 2 రన్స్ వచ్చాయంతే. శుభ్‌మన్ గిల్(0), వృద్ధిమాన్ సాహా(0)క్రీజులో ఉన్నారు.
మోహిత్ శర్మ వేసిన 20వ ఓవర్లో విరాట్ కోహ్లీ(101 నాటౌట్ : 61బంతుల్లో 13 ఫోర్లు ఒక సిక్స్) వరుసగా రెండో సెంచరీ బాదాడు. అనుజ్ రావత్(21 నాటౌట్) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. దాంతో, ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ(100 : 60 బంతుల్లో 13 ఫోర్లు ఒక సిక్స్)వరుసగా రెండో సెంచరీ బాదాడు. మోహిత్ శర్మ వేసిన 20వ ఓవర్లో సింగిల్ తీసి శతకం సాధించాడు. దాంతో, ఐపీల్లో అత్యధికంగా ఏడు సెంచరీలు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
రషీద్ ఖాన్ ఓవర్లో 6 రన్స్ వచ్చాయి. దాంతో, ఆర్సీబీ స్కోర్ 150 దాటింది. విరాట్ కోహ్లీ(77), అనుజ్ రావత్(5) క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లకు స్కోర్.. 155/5
మోహిత్ శర్మ ఓవర్లో విరాట్ కోహ్లీ(73) రెండు బౌండరీలు బాదాడు. అనుజ్ రావత్(3) క్రీజులో ఉన్నాడు. 16 ఓవర్లకు స్కోర్.. 149/5
యశ్ దయాల్ ఓవర్లో దినేశ్ కార్తిక్(0) డకౌటయ్యాడు. కీపర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. దాంతో, ఆర్సీబీ సగం వికెట్లు కోల్పోయింది. అనుజ్ రావత్ వచ్చాడు. విరాట్ కోహ్లీ(61) క్రీజులో ఉన్నాడు.
షమీ కీలక వికెట్ తీశాడు. దంచికొడుతున్న మైఖేల్ బ్రేస్‌వెల్(26)ను ఔట్ చేశాడు. లో ఫుట్ టాస్‌ను ఆడబోయిన బ్రేస్‌వెల్, షమీకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ(60) క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లకు స్కోర్.. 132/4
హాఫ్ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ(58), మైఖేల్ బ్రేస్‌వెల్(24) దంచుతున్నారు. మోహిత్ శర్మ ఓవర్లో కోహ్లీ ఒకటి, బ్రేస్‌వెల్ రెండు ఫోర్లు బాదారు. 15 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు స్కోర్.. 127/3
సూపర్ ఫామ్‌ల ఉన్న విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీ కొట్టాడు. నూర్ అహ్మద్ ఓవర్లో రెండు రన్స్ తీసి ఫిఫ్టీ సాధించాడు.
మోహిత్ శర్మ ఓవర్లో మైఖేల్ బ్రేస్‌వెల్(10) వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఆర్సీబీ స్కోర్ 50 దాటింది. విరాట్ కోహ్లీ(49) క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లకు స్కోర్.. 104/3
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడడంతో ఆర్సీబీ స్కోర్ వేగం తగ్గింది. నూర్ అహ్మద్ ఓవర్లో విరాట్ కోహ్లీ(48) బౌండరీ బాదాడు. మైఖేల్ బ్రేస్‌వెల్(1) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 93/3
ఆర్సీబీ మూడో వికెట్ పడింది. నూర్ అహ్మద్ ఓవర్లో మహిపాల్ లొమ్రోర్(1) స్టంపౌటయ్యాడు. విరాట్ కోహ్లీ(42) క్రీజులో ఉన్నాడు.
రషీధ్ ఖాన్ బిగ్ వికెట్ తీశాడు. డేంజరస్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(11)ను బౌల్డ్ చేశాడు. వచ్చాడు. విరాట్ కోహ్లీ(40) ఆడుతున్నాడు.
ఆర్సీబీకి షాక్.. నూర్ అహ్మద్ ఓవర్లో ఫాఫ్ డూప్లెసిస్(28) ఔటయ్యాడు. స్లిప్‌లో రాహుల్ తెవాటియా క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. దాంతో, 67 వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వచ్చాడు. విరాట్ కోహ్లీ(38) ఆడుతున్నాడు.
నూర్ అహ్మద్ ఓవర్లో ఐదో బంతికే విరాట్ కోహ్లీ(36)కవర్స్‌లో ఫోర్ బాదాడు. 7 పరుగులు వచ్చాయి. ఫాఫ్ డూప్లెసిస్(25) ఆడుతున్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 62/0
రషీధ్ ఖాన్ వేసిన తొలి బంతికే విరాట్ కోహ్లీ(29) ఫోర్ బాదాడు. ఆర్సీబీ స్కోర్ 50 దాటింది. ఫాఫ్ డూప్లెసిస్(23) ఆడుతున్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 53/0
విరాట్ కోహ్లీ(21) దంచుతున్నాడు. యశ్ దయాల్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. ఆఖరి బంతిని ఫాఫ్ డూప్లెసిస్(21) బౌండరీగా మలిచాడు. 17 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు స్కోర్.. 43/0
ఫాఫ్ డూప్లెసిస్(17) దూకుడు పెంచాడు. షమీ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. ఆఖరి బంతిని బౌండరీగా మలిచాడు. 16 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ(8) ఆడుతున్నాడు. మూడు ఓవర్లకు స్కోర్.. 26/0
యశ్ దయాల్ ఓవర్లో 4 రన్స్ వచ్చాయంతే. విరాట్ కోహ్లీ(8), ఫాఫ్ డూప్లెసిస్(1) ఆడుతున్నారు. రెండు ఓవర్లకు స్కోర్.. 10/0
షమీ వేసిన తొలి ఓవర్లో ఓపెనర్ విరాట్ కోహ్లీ(5) మూడో బంతికి ఫోర్ బాదాడు. 6 పరుగులు వచ్చాయి.
ఫాఫ్ డూప్లెసిస్(0), ఆడుతున్నాడు.
మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్, అంపైర్లు మైదానలోకి వచ్చారు. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైనా కూడా 20 ఓవర్ల పాటు ఆట సాగనుంది.
ఆర్సీబీ : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లొమ్రోర్, మేఖేల్ బ్రేస్‌వెల్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, సిరాజ్, విజయ్ కుమార్.
గుజరాత్ : శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా(), హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, దసున్ శనక, రాహుల్ తెవాటియా, రషీధ్ ఖాన్, మోహిత్ శర్మ, షమీ, యశ్ దయాల్.
A look at the Playing XIs of the two teams 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/OQXDTMiSpI #TATAIPL | #RCBvGT pic.twitter.com/iIOzvZ3Cal
— IndianPremierLeague (@IPL) May 21, 2023
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వర్షం తగ్గడంతో మరికాసేపట్లో టాస్ వేయనున్నారు. 7ః45కి టాస్ కోసం ఆర్సీబీ, గుజరాత్ కెప్టెన్లు మైదానంలోకి రానున్నారు.
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.