మకావు: మకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ అష్మితా చాలిహా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 6 3వ ర్యాంకర్ అష్మిత 21-16, 21-18తో వరుస గేమ్స్‌లో ప్రపంచ 99వ ర్యాంకర్ కిమ్ మిన్ సన్ (కొరియా)ను ఓడించింది.
ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ టూర్ ఈవెంట్లలో అస్మితకు ఇదే తొలి సెమీఫైనల్. ఫైనల్ బెర్తు కోసం ఆమె కొరియాకే చెందిన పార్క్ గా యున్‌తో తలపడనుంది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ 51వ ర్యాంకర్ అన్మోల్ ఖర్బ్ 21-14, 15-21, 13-21 తేడాతో 36వ ర్యాంకర్ హాన్ కియాన్ జి (చైనా) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.