మరింత తగ్గిన పుత్తడి.. రూ.3 వేల వరకు దిగిన తులం విలువ
బంగారం ధరలు మరింత తగ్గాయి. వరుసగా నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర శుక్రవారం రూ.1.5 లక్షల స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,840 తగ్గి రూ.1,50,600కి పడిపోయింది.
న్యూఢిల్లీ, జూన్ 19 : బంగారం ధరలు మరింత తగ్గాయి. వరుసగా నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర శుక్రవారం రూ.1.5 లక్షల స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,840 తగ్గి రూ.1,50,600కి పడిపోయింది. అంతకుముందు ఇది రూ.1,53,440గా ఉన్నది. డాలర్‌కు డిమాండ్ పడిపోవడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
పసిడితోపాటు వెండి ధరలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.8,040 తగ్గి రూ.2,40,700కి పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న నమోదైన రూ.2.40 లక్షల స్థాయికి పడిపోయినట్టు అయింది. అమెరికా వడ్డీరేట్లు అధిక స్థాయిలో ఉండవచ్చన్న అంచనాలతో పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గుచూపడంతో బులియన్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

