న్యూఢిల్లీ: పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ను భారత్ అష్ట దిగ్బంధం చేస్తున్నది. తాజాగా పాక్‌కు చెందిన విమానాలు భారత గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. ఇప్పటికే పాక్ తన గగనతలాన్ని మూసివేసి భారత్ విమానాలకు ప్రవేశం లేకుండా అడ్డుకుంది. దీనికి ప్రతీకారంగా భారత్ కూడా పాకిస్థాన్‌కు చెందిన, దాని ఆధ్వర్యంలో నడుస్తున్న, ఆ దేశం లీజుకు తీసుకున్న వాణిజ్య విమానాలతో పాటు మిలిటరీ విమానాలకు తమ గగనతలంలో ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. భారత్ విధించిన ఈ ఆంక్షలతో కౌలాలంపూర్ లాంటి ఆగ్నేయ ప్రాంతాలకు వెళ్లే పాకిస్థాన్ విమానాలు చైనా, శ్రీలంక లాంటి దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.