INDW vs SAW : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అసలైన సవాల్‌కు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచుల్లో అలవోకగా గెలుపొందిన టీమిండియా ఆదివారం దక్షిణాఫ్రికాను ఢీ కొడుతోంది. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20ల్లో రెండొందల మ్యాచ్ ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర సృష్టించనుంది.
లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను, ఆపై న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియాకు దక్షిణాఫ్రికా రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురవుతోంది. ఈ మ్యాచ్‌తో హర్మన్‌ప్రీత్ మహిళల క్రికెట్లో రెండొందల టీ20లు ఆడిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనుంది. హెడ్‌కోచ్ అన్మోల్ మజుందార్ చేతుల మీదుగా రెండొందల నంబరున్న టోపీ, జెర్సీని అందుకుంది కెప్టెన్. అనంతరం భారత క్రికెటర్లు ఆమెకు అభినందనలు తెలిపారు.
#TeamIndia win the toss & will bat first against South Africa! 🙌
Here are the team changes –
🇮🇳 Prema Rawat & Arundhati Reddy replace Shreyanka Patil & Kranti Gaud
🇿🇦 Dane van Niekerk and Tazmin Brits are in for Sune Luus and Kayla ReynekeICC Women’s #T20WorldCup 2026 |… pic.twitter.com/BooFgffYV4
— Star Sports (@StarSportsIndia) June 21, 2026
భారత తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, నందిని శర్మ.
దక్షిణాఫ్రికా తుది జట్టు : లారా వొల్వార్డ్త్(కెప్టెన్), తంజిమ్ బ్రిట్స్, అనేరీ డెర్క్సెన్, డానెవాన్ నీకెర్క్, మరినే కాప్, నడినే డీక్లెర్క్, చోలే ట్రయాన్, సినాలో జఫ్తా, షబ్నం ఇస్మాయిల్, అయబొంగా ఖాక, నొన్కులెలెకొ మ్లాబా.