బాలీవుడ్ ఫ్రాంచైజీ చిత్రాల్లో సక్సెస్ పుల్ సినిమాగా పేరు తెచ్చుకుంది ‘ఫక్రీ’. దర్శకుడు మృగదీప్ సింగ్ లంబా తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఇప్పుడు మూడో సినిమా ‘ఫక్రీ 3’ తెరకెక్కుతున్నది. ఈ సిరీస్ విజయంతో పులకిత్ సమ్రాట్, అలీ ఫజల్‌తో పాటు నాయికగా ఇండస్ట్రీలో స్థిరపడింది రిచా చద్దా. డ్రగ్ వ్యాపారి పాత్రలో నటించిన ఆమె ఇప్పుడు మూడో చిత్రంలోనూ నటిస్తున్నది. పాండమిక్ వల్ల షూటింగ్ వాయిదాలు పడిన ఈ సినిమా తాజాగా సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సందర్భంగా రిచా చద్దా మాట్లాడుతూ…‘రెండు సార్లు పాండమిక్ రావడం, మూడు వేవ్‌ల తర్వాత మా సినిమా సెట్స్ మీదకు వచ్చింది. నా పాత్ర బోలీ పంజాబన్లో ఎన్నిసార్లు నటించేందుకైనా సిద్ధం. నాకు అంత బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది. మొదటి చిత్రంలో నేను డ్రగ్స్ అమ్ముతుంటాను. రెండో భాగంలో జైలుకు వెళ్తాను. మూడో పార్టు సినిమాలో రాజకీయాల్లోకి వస్తాను’ అని చెప్పింది.