Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Hyderabad | రహ్మత్ నగర్ ప్రధాన రహదారి వెంబడి సుమారు 1000 గజాల స్థలంలో నివాస సముదాయంతో పాటు విశాలమైన ఖాళీ స్థలంలో బోర్లు వేసి కొన్నేండ్లుగా అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నారు.
Hyderabad | జూబ్లీహిల్స్, అక్టోబర్ 22: రహ్మత్ నగర్ ప్రధాన రహదారి వెంబడి సుమారు 1000 గజాల స్థలంలో నివాస సముదాయంతో పాటు విశాలమైన ఖాళీ స్థలంలో బోర్లు వేసి కొన్నేండ్లుగా అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నారు. స్థానికుడైన ఓ వ్యాపారి అత్యంత లోతుగా వేసిన నాలుగైదు బోర్లతో భారీగా నీటిని తోడేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అధికారుల అండదండలతో అతడు ప్రతి రోజూ లక్షల్లో నీటి వ్యాపారం చేస్తూ.. కోట్లు గడిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రతిరోజూ 5 డీసీఎంలు, 5 భారీ వాటర్ ట్యాంకర్లు 24 గంటలు నిర్విరామంగా నీటిని తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు రాత్రి సమయంలో నగరంలోని అనేక ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకర్లు వచ్చి నీటిని తరలిం చుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా చుట్టపక్కల ప్రాంతాల్లో సాధారణ బోర్లు ఎండిపోతున్నాయన్న ఆందో ళన వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా అధి కారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా రని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విష యమై స్థానికుడైన గోపాలకృష్ణ ఇటీవల ఖైరతా బాద్ తహసీల్దార్ ఎం. ప్రేమ్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
వాటర్ ప్లాంట్ దగ్గర రౌడీల రాజ్యం
కొన్నేండ్లుగా అక్రమ నీటి దందా చేస్తున్న సదరు వ్యాపారి ఏకంగా ఒక కోటరీనే నిర్మించాడు. మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ సామ్రాజ్యానికి పది మంది గుండాలు కాపలాగా పహారా కాస్తుంటారని స్థానికులు తెలి పారు. అటు పక్క ఎవరైనా ఫొటోలు తీయ డానికి ప్రయత్నిస్తే వీరు దౌర్జన్యంగా అడ్డు కుంటారని తెలిపారు. దీంతో అడ్డూ అదుపు లేకుండా ఇక్కడ నుంచి ప్రతిరోజూ వందలాది వాటర్ ట్యాంకర్ల నీటిని తరలి స్తున్నారని.. గత కొన్నేండ్లుగా జరుగుతున్న ఈ అక్రమ నీటి వ్యాపారానికి అధికారుల అండ మెండుగా ఉన్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రతిరోజూ వాటర్ ట్యాంకర్ల రాకపోకలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నా పట్టించుకో వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలి
స్థానికంగా నీటి వ్యాపారంతో మా ఇంట్లో బోర్లు ఎండిపో యాయి. చుట్టుపక్కల సుమారు 500 ఇండ్లలో అందరిదీ ఇదే పరిస్థితి. రోజూ వాటర్ ట్యాంకర్లతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ నుంచి ప్రతి రోజూ వందలాది ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నారు. ప్రభు త్వంచర్యలు తీసుకుని అక్రమ నీటి వ్యాపారాన్ని అడ్డుకోవాలి.
– గోపాలకృష్ణ, స్థానికుడు
చర్యలు తీసుకుంటాం
అక్రమంగా బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటాం. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుపై విచారణ చేపడతాం. స్థానికంగా ఫిర్యాదు అందిన నివాస గృహాన్ని తనిఖీ చేసి.. అనుమతులు లేకుండా బోర్లు ఉంటే సీజ్ చేస్తాం.
– ఎం. ప్రేమ్ కుమార్, తహసీల్దార్, ఖైరతాబాద్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

