ఐఐటీహెచ్‌కు మెరుగైన ర్యాంక్
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్యూఎస్ ఆసియా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో ఐఐటీహెచ్ 251వ స్థానా న్ని సాధించింది. నిరుడు 270వ స్థానంలో ఉండగా ర్యాంక్ మరింత మెరుగుపడింది.
- నిరుడు 270వ స్థానం తాజాగా 251వ ర్యాంక్
- క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్‌లో పురోగతి
కంది, నవంబర్ 3 : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్యూఎస్ ఆసియా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో ఐఐటీహెచ్ 251వ స్థానాన్ని సాధించింది. నిరుడు 270వ స్థానంలో ఉండగా ర్యాంక్ మరింత మెరుగుపడింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. మెరుగైన ర్యాంకింగ్స్ తమ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, సిబ్బంది నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
విద్య, పరిశోధనలకు బలమైన పునాదులు వేయడంతోపాటు ప్రపంచ సమస్యల పరిష్కారాలతో అనుసంధానించే వాతావరణాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. అధ్యాపకులు ఉన్నత లక్ష్యాలతో వినూత్న ఆలోచనలు అభివృద్ధి చేసి వాటిని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలుగా మలిచేలా నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. మెరుగైన ర్యాంకింగ్‌కు కృషి చేసిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, పరిశోధకులను అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

