అధిక బరువు తగ్గాలంటే.. ఈ డైట్ ఉత్తమం..!
డైట్ |అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా ? అయితే శాకాహారం మాత్రమే తీసుకోండి. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సైంటిస్టులే చెబుతున్నారు.

అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా ? అయితే శాకాహారం మాత్రమే తీసుకోండి. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సైంటిస్టులే చెబుతున్నారు.
శాకాహారం తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయని, దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండడంతోపాటు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారు అధిక బరువు తగ్గేందుకు శాకాహార డైట్‌ను సూచిస్తున్నారు. అదేమిటంటే…
శాకాహార డైట్‌ను ఫాలో అయ్యేవారు జంతు సంబంధ పదార్థాలను పూర్తిగా మానేయాలి. అంటే చికెన్, మటన్, చేపలు, కోడిగుడ్లు, ఆఖరికి పాలు, పాల సంబంధ పదార్థాలు, తేనెను కూడా పూర్తిగా మానేయాలి. ఇక కింద చెప్పిన విధంగా మూడు పూటలా భోజనం ప్లాన్ చేయాలి.
బ్రేక్‌ఫాస్ట్
శరీరానికి శక్తినికి అందించడంలో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్యమైంది. కనుక బ్రేక్‌ఫాస్ట్‌ను ఎప్పుడూ మానకూడదు. అందులో ఒక పండు లేదా వెజిటబుల్ సలాడ్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నట్స్, ఓట్ మీల్, శాండ్ విచ్, క్వినోవా, ఫ్రూట్ స్మూతీ, సోయా, బాదం మిల్క్ తీసుకోవాలి.
లంచ్
మధ్యాహ్నం భోజనంలో కూరగాయలు, పప్పులు, అన్నం, గోధుమ పిండి లేదా చిరు ధాన్యాలతో చేసిన రొట్టెలు, చిక్కుడు జాతి గింజలు, కూరగాయల సలాడ్, నట్స్, సీడ్స్ తీసుకోవచ్చు. దీంతో ప్రోటీన్లు సరిగ్గా అందుతాయి.
డిన్నర్
రాత్రి భోజనం చాలా లైట్‌గా చేయాలి. తక్కువ తినాలి. అందులో పప్పులు, బియ్యంతో తయారు చేసిన కిచ్డీ ఉండాలి. అవసరం అనుకుంటే అందులో కూరగాయలు వేసుకోవచ్చు. లేదా కూరగాయలతో తయారు చేసే సూప్ తాగవచ్చు. శనగలు, టమాటాలు, ఉల్లిపాయలు తదితర కూరగాయలతో చేసిన కూరలను తినవచ్చు.
పైన చెప్పిన డైట్‌ను పాటిస్తే ఎవరైనా త్వరగా బరువు తగ్గించేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- best
- diet
- Weight loss
- అధిక బరువు
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

