సుమంత్, నైనా గంగూలీ, వర్షిణీ సౌందరరాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మళ్లీ మొదలైంది’. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఇటీవల ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నదని చెబుతున్నారు దర్శకుడు టీజీ కీర్తి కుమార్. మీడియాతో ఆ విశేషాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ…‘విడాకులు తీసుకున్న జంట జీవితం మళ్లీ ఎలా మొదలైంది అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కించాను. విడాకులు ఏ దంపతులకైనా బాధాకరం. అయితే ఆ బాధను గుర్తు చేయకుండా వినోదాత్మక కోణంలో సినిమాను రూపకల్పన చేశాం. ఇవాళ విభిన్న కథా చిత్రాలను ఓటీటీలో బాగా చూస్తున్నారు. మా సినిమా కూడా డిజిటల్ వేదిక నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది’ అన్నారు.