మహాలక్ష్మి విజిల్ వేస్తే..
రేడీయో జాకీ విజిల్ మహాలక్ష్మి కర్నూల్లో చాలా ఫేమస్. ఈ అమ్మడికి అభిమానులు కూడా ఎక్కువే. మహాలక్ష్మి పోగ్రామ్ చేసిందంటే ఫ్యాన్స్ హంగామాతో అదిరిపోవాల్సిందే. జీవితాన్ని సరదాగా గడిపే ఆ భామ ఓ పోలీస్ అధికారి ప్రేమలో ఎలా పడింది? వారిద్దరి ప్రేమాయణంలోని మలుపులు ఏమిటన్నది తెరపై చూడాల్సిందే అంటున్నారు లింగుస్వామి. ఆయన దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ సినిమాలో రామ్ సరసన కృతిశెట్టి నటిస్తున్నది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. సోమవారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాలక్ష్మి పాత్రధారిణి కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘పవర్ఫుల్ యాక్షన్‌తో పాటు హృదయాన్ని తడిమే ప్రేమకథ ఉంటుంది. ఆర్జే మహాలక్ష్మిగా కృతిశెట్టి పాత్రను అందరూ ఇష్టపడతారు. రామ్-కృతిశెట్టి జోడీ చూడముచ్చటగా ఉంటుంది’ అని దర్శకుడు తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, సమర్పణ: పవన్‌కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్. లింగుస్వామి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

