ఆకలి బాగా పెరగాలంటే.. ఇలా చేయాలి..!

ఆకలి బాగా అయితేనే మనం ఆహారం తింటాం. జీర్ణం బాగా అవుతుంది. దాంతో మనకు శక్తి, పోషకాలు లభిస్తాయి. అయితే ఆకలి లేకపోతే ఏ ఆహారాన్నీ తినలేం. దీంతో నీరసం, అలసట వస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆకలి లేకపోవడమనే సమస్యతో సతమతమవుతుంటారు. మరి ఆకలి బాగా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఒక టీస్పూన్ బెల్లం పొడి, అర టీస్పూన్ నల్లమిరియాల పొడిలను కలిపి రోజూ ఒక పూట తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది.
అర టీస్పూన్ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిపి 10 రోజుల పాటు రోజూ ఈ మిశ్రమాన్ని భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది.
ఒక కప్పులో నీటిని తీసుకుని అందులో 2 టీస్పూన్ల ఉసిరికాయ రసం, 2 టీస్పూన్ల నిమ్మరసం, 2 టీస్పూన్ల తేనెలను బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఆకలి బాగా పెరుగుతుంది.
రోజూ భోజనం చేసే ముందు 2 లేదా 3 యాలకుల గింజలను నమిలి మింగాలి. దీంతో మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడమే కాదు, ఆకలి కూడా బాగా పెరుగుతుంది.
ఒక టీస్పూన్ నిమ్మరసంలో 2 టీస్పూన్ల వామును కలిపి ఈ మిశ్రమాన్ని ఎండలో పెట్టాలి. అనంతరం కొంత సేపు అయ్యాక అందులో నల్ల ఉప్పును కొద్దిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. దీంతో ఆకలి పెరుగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- health tips
- hunger
- increase
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

