హైదరాబాద్, డిసెంబరు 24 ( నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌లో ఉన్న బ్లాక్‌టౌన్ కౌన్సిల్‌కు తెలంగాణకు చెందిన చెట్టిపల్లి లివింగ్స్టన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జన్మించిన ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్‌డబ్ల్యూ చేశారు. ఆస్ట్రేలియా సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. ప్రస్తుతం న్యూసౌత్‌వేల్స్‌లోని పర్రామట్టలో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ జస్టిస్‌లో సీనియర్ చేంజ్ అనలిస్ట్, ప్రాజెక్ట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి జెస్సీ డేవిడ్ ముషీరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్‌లోని ఎంబీ హైస్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైరయ్యారు. లివింగ్స్టన్ ఎన్నికపట్ల టీఆర్ఎస్ ఎన్నారై శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ విజయం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నది.