
నేరేడ్మెట్, నవంబర్ 14 : ఆనంద్‌బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం ఆదివారం కనుల పండువగా జరిగింది. దేవాలయ ప్రధాన అర్చకులు వెంకటరమణా చార్యులు, అర్చకులు తులసీ వెంకటరమణా చార్యులు ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించి, మేళ తాళాలు, భాజా భజంత్రీలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు దేవాలయ కార్యనిర్వా హణాధికారి ఏబీ రవీంద్రారెడ్డి , ఆలయ క్లర్క్ సండ్ర సుధాకర్ తీర్థ ప్రసా దాలు అందజేశారు. కార్యక్రమంలో వరదరాజులు, భక్తులు పాల్గొన్నారు.