ZIM vs BAN : సుదీర్ఘ ఫార్మాట్లో జింబాబ్వే(Zimbabwe) సంచలన విజయంతో అదరగొట్టొంది. స్వదేశంలో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ (Bangladesh)పై భారీ విజయంతో రికార్డు నెలకొల్పింది. తమను తక్కువ అంచనా వేస్తే భంగపాటు తప్పదని చాటుతూ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడా బంగ్లాను చిత్తు చేసింది. పేస్ త్రయం బ్లెస్సింగ్ ముజరబని(4-65), రిచర్డ్ నగరవ(3-32), న్యూమన్ న్యాంహురి(2-28)లు నిప్పులు చెరగగా పర్యాటక జట్టు బ్యాటర్లు క్రీజులో నిలిచేందుకు అష్టకష్టాలు పడ్డారు. సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(34) పోరాడినా సరిపోలేదు. ఫలితంగా మూడో రోజు రెండో సెషన్లోనే మ్యాచ్ ముగిసింది.
ఇటీవల టెస్టు క్రికెట్లో పాకిస్థాన్, వెస్టిండీస్‌పై చరిత్రాత్మక విజయాలతో జింబాబ్వే పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌కు పెద్ద షాక్ తగిలింది. చిన్న జట్టే కదా అని తేలికగా తీసుకున్నందుకు భారీ మూల్యం చెల్లిస్తూ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో నజ్ముల్ హుసేన్ శాంటో సేన కంగుతిన్నది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూమన్(4-61), ముజరబని(2-19)ల ధాటికి 140కే పరిమితమైన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది.
Zimbabwe beat Bangladesh by an innings and 85 runs to record their biggest-ever Test victory 🙌
It’s the first time Zimbabwe have recorded back-to-back innings victories in Test cricket, having defeated Afghanistan by an innings and 73 runs in their last series pic.twitter.com/c1Z5Zoqeyo
— Cricinfo (@cricinfo) June 30, 2026
ఫాలో ఆన్ ఆడిన పర్యాటక జట్టు మూడో రోజు 40/1తో ఆట మొదలెట్టింది. కానీ, బంగ్లాను బ్లెస్సింగ్ ముజరబని(4-65), రిచర్డ్ నగరవ(3-32)లు వికెట్ల వేటతో బంగ్లాను కోలుకోలేని దెబ్బతీశారు. సహచరులు విఫలమైనా.. సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(34) కాసేపు నిలబడ్డాడు. కానీ, రిచర్డ్, ముజరబని ద్వయం ధాటికి టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. 185 రన్స్‌కే ఆలౌటైన పర్యాటక జట్టు ఇన్నింగ్స్ 85 పరుగుల ఓటమి మూటగట్టుకుంది. ఇదివరకూ అఫ్గనిస్థాన్‌ను సైతం ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఓడించింది జింబాబ్వే.
తొలి ఇన్నింగ్స్‌లోనే బంగ్లాదేశ్‌ను వణికించిన జింబాబ్వే మ్యాచ్‌పై పట్టు బిగించింది. 36 వద్ద ఓపెనర్లను కోల్పోయిన బంగ్లాను మొమినుల్ హక్(60) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. కానీ, న్యూమన్ న్యాంహురి(4-61), ముజరబని(2-19)లు మిడిలార్డర్‌ను పడగొట్టారు. వీరి జోరుకు టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా. 140కే బంగ్లా కుప్పకూలింది. అనంతరం.. ఓపెనర్ ఇన్నోసెంట్ కియా(140) భారీ శతకంతో చెలరేగగా.. క్రెగ్ ఇర్విన్ 60 పరుగులతో మెరిశాడు. తైజుల్ ఇస్లాం(7-138) రాణించగా ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 410 వద్ద ముగిసింది.
A knock to remember.
Take a bow, Innocent Kaia 🙌🏾#ZIMvBAN #ExperienceZimbabwe pic.twitter.com/nPK1UkRLvF
— Zimbabwe Cricket (@ZimCricketv) June 29, 2026