వినమ్రతే ముఖ్యం!
పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికి ఎదుటివారి పట్ల హూందాగా, ఉదారస్వభావంతో వ్యవహరించడం చాలా ముఖ్యమని చెబుతోంది బాలీవుడ్ యువ కథానాయకి జాన్వీకపూర్. ఇటీవలే ఆమె తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్లో తన రెండేళ్ల ప్రయాణం గురించి ముచ్చటించింది. పరిశ్రమలో విజయాలు సాధించడం కంటే మంచి వ్యక్తిత్వంతో కొనసాగడానికి తాను ప్రాధాన్యతనిస్తానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘అసూయద్వేషాలకు అతీతంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందని అమ్మనాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. వాళ్ల మాటల్ని ప్రతి సందర్భంలో గుర్తుతెచ్చుకుంటా. ఇండస్ట్రీలో ఈగో పరమైన విభేదాల వల్లే ఎక్కువ సమస్యలొస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఓ మెట్టు దిగితే తప్పుకాదనుకుంటా. వినమ్రంగా ఉన్నవారిలో పరిణితి ఎక్కువగా ఉంటుందని, వారే జీవితంలో ఉన్నతశిఖరాల్ని అధిరోహిస్తారని నా పేరెంట్స్ చెప్పిన మాటలు శిరోధార్యంగా భావిస్తా’ అని చెప్పుకొచ్చింది జాన్వీకపూర్. ప్రస్తుతం ఈ సుందరి బాలీవుడ్లో ‘రూహీ’ ‘దోస్తానా’ ‘గుడ్‌లక్ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

