తాళపత్రాలను ఎలా తయారుచేస్తారు? వాటిపై ఎలా రాస్తే ఎక్కువ కాలం ఉంటాయ్ !!
Talapatra | ప్రాచీన మానవులు తమ భావాలు, ఆలోచనలను రాళ్లపై గుర్తులు, బొమ్మల రూపంలో వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత భాషతోపాటు లిపినీ కనిపెట్టారు. ఆ జ్ఞానాన్ని తాటి ఆకులపై భద్రపరుచుకున్నారు. ‘తాళపత్రాల ( Talapatra )’ రూపంలో ఆ సంపదను ముందుతరాలకు అందించారు.
సాహిత్యం, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ముందుతరాలకు అందించడానికి మన పూర్వికులు ఎంచుకున్న గొప్ప మాధ్యమం తాళపత్ర గ్రంథాలు. వివిధ రోగాలను నయంచేసే ఆయుర్వేద విజ్ఞానంతోపాటు పురాణేతిహాసాలు, పంచాంగాలు, శాస్ర్తాలు, లౌకిక గ్రంథాలు, వ్యాకరణాలు.. అన్నిటినీ తాళపత్రాలపైనే గ్రంథస్థం చేశారు. బృహత్ గ్రంథాల రచనకూ తాటాకులనే ఉపయోగించారు. అందుకే.. ఆ చారిత్రక ప్రతులు విలువైన సాంస్కృతిక సంపదగా నిలుస్తున్నాయి.

తయారీ విధానం..
తాళపత్రాల తయారీకి ప్రధాన ముడిసరుకు భూలోక కల్పవృక్షంగా పేరున్న తాటిచెట్లే. ఇందుకోసం 10 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరిగే తాటిచెట్ల నుంచి ఒక మీటరు పొడవుతో పొరలు పొరలుగా ఉండే ఆకులను సేకరిస్తారు. ఎక్కువ పొరలు ఉన్న ఆకులు రాతకు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలం మన్నుతాయి. ఇలా సేకరించిన ఆకులను శుభ్రపరిచి ఎండబెట్టి, తాటి రేకులుగా తయారుచేస్తారు. తాటి ఆకుల నుంచి రాయడానికి అనుకూలంగా ఉండే ‘తాళపత్రాలు’ తయారుచేయడం అన్నది ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే, అమూల్యమైన జ్ఞాన సంపదను నిక్షిప్తం చేసుకున్న తాళపత్రాలు వందల ఏండ్లు మన్నేలా కాపాడుకోవాలి. అందుకే, వీటి తయారీలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఇందుకు రకరకాల పద్ధతులు.

› ముందుగా తాటి ఆకులను నీడలో ఆరబెడు తారు. అవి మెత్తగా తయారవడానికి నువ్వుల నూనెను దట్టంగా పట్టిస్తారు.
› ఆకులను ఎండబెట్టిన తర్వాత మట్టిలో కానీ, ఇసుకలో కానీ 15 రోజులపాటు ఉంచుతారు. తర్వాత బయటికి తీసి శుభ్రపరుస్తారు. ఆకులకు చెదలు పట్టకుండా పసుపు రాస్తారు.
› తాటి ఆకులు సన్నగా, మృదువుగా మారడానికి వేడినీళ్లలో ఉడికిస్తారు. ఎక్కువ కాలం మన్నేలా ఆ నీటిలో పసుపు వేస్తారు. అనంతరం వాటిని ఎండలో ఆరబెడుతారు.

గ్రంథాలుగా మార్చి..
ఆకు పరిమాణాన్ని బట్టి ఒక్కో తాళపత్రంపై ఆరు నుంచి ఎనిమిది వరుసలు రాసేవారు. రెండువైపులా కలిపి నాలుగైదు పద్యాలను లిఖించేవారు. ఎడమవైపు పైభాగంలో తమ ఇష్టదైవాల చిత్రాలు వేసేవారు. ఇలా రాసిన పత్రాలను ఒక దగ్గర చేర్చి, గ్రంథాలుగా మారుస్తారు. ఇందుకోసం పత్రాలకు రెండు వైపులా (కొన్నిటికి ఒకవైపు మాత్రమే) రంధ్రాలు చేస్తారు. పత్రాలు విడిపోకుండా ఆ రంధ్రాల గుండా సన్నని తాడును దూర్చి ఆకులను బంధిస్తారు. ఈ పత్రాలు వంగిపోకుండా, విడిపోకుండా తాటిమట్టలు, టేకు చెక్కలను రక్షణగా వాడుతారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు తాళపత్ర గ్రంథాల సేకరణ, పరిరక్షణ కోసం 30 ఏండ్లుగా కృషి చేస్తున్నారు. భారతదేశం అంతటా పర్యటించి వేల సంఖ్యలో తాళపత్రాలను సేకరించారు. వాటి వివరాలతో ‘తెలుగు రాతప్రతులు’ అనే పుస్తకాన్నీ రచించారు. ప్రాచ్య లిఖిత భాండాగారం, చెన్నై మ్యూజియం, వరంగల్‌లోని గిరిజన విజ్ఞాన పీఠాలలోనూ వేలాది తాళపత్ర గ్రంథాలున్నాయి.

ఇలా రాస్తారు..
సున్నితమైన మొనగలిగిన ‘ఘంటం’తో ఆకులపై అక్షరాలను చెక్కే పద్దతి పూర్వం ఉండేది. రాసేవారు నేల మీద కూర్చుని, ఘంటాన్ని కుడిచేతిలో పట్టుకుని.. ఆకుపై కావలసిన అక్షరాలను చెక్కుతారు. అయితే, తాటి ఆకుపై ఘంటంతో చెక్కిన అక్షరాలు సరిగ్గా కనిపించవు. అందుకే, ఆ అక్షరాలపై ప్రత్యేకంగా తయారుచేసిన బూడిద పూస్తారు. ఇందుకోసం కొబ్బరి చిప్పలు, గడ్డి కాల్చగా వచ్చిన నల్లటి బూడిదకు పసుపు, నువ్వుల నూనె కలుపుతారు. ఈ మిశ్రమాన్ని పత్రాలపై రాసిన అక్షరాలపై పూస్తారు. అక్షరాల చుట్టూ అధికంగా ఉన్న రంగును వస్త్రంతో శుభ్రం చేస్తారు.
… అరవింద్ ఆర్య, 7997 270 270
Read More :
గిరిజనుల ఇండ్లలో పెండ్లిళ్లు, పండుగలు ఏది చేయాలన్నా వీళ్లే కీలకం.. ఎందుకంటే..
Batik Art | జావా దీవుల్లో పుట్టిన ఈ కళ మన దేశంలో ఎలా ఫేమస్ అయింది? దీని స్పెషాలిటీ ఏంటి?
Gollabhama Sarees | సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లోనే తయారయ్యే ఈ చీరల స్పెషాలిటీ ఏంటంటే..
Thoti Tribes | గోండుల ఇండ్లల్లో పెండ్లయినా.. చావైనా.. వీళ్లు రావాల్సిందే !!
అంతరించిపోతున్న కూనపులి కళను కాపాడుతున్న ఒకే ఒక్కడు.. అసలు దాని ప్రత్యేకత ఏంటి?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

