Honey |నవీన్ చంద్ర, దివ్య పిళ్లై కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. శేఖర్ స్టూడియోస్ సమర్పణలో OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మాణంలో దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రియల్ లైఫ్‌లో జరిగిన పలు సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఆసక్తికరమైన బజ్‌ను క్రియేట్ చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా మేకర్స్ నేడు ‘హనీ’ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌ను కలగలిపి, ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథను రూపొందించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. గ్లింప్స్‌లో కనిపించే విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాత్రల ప్రవర్తన అన్ని కలిసి ఓ డిస్టర్బింగ్, మిస్టీరియస్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. నవీన్ చంద్ర పాత్ర చాలా డిఫరెంట్ షేడ్స్‌తో ఉండబోతుందని, దివ్య పిళ్లై క్యారెక్టర్ కథలో కీలక మలుపులు తిప్పబోతుందనే సంకేతాలు గ్లింప్స్‌లో కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కరుణ కుమార్ గతంలో రియలిస్టిక్ టచ్‌తో కథలను చెప్పిన అనుభవాన్ని ఈసారి హారర్ జానర్లో ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.‘హనీ’ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హారర్ సినిమాలకి కరెక్ట్ సీజన్లో ఈ సినిమా రావడంతో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికి రియల్ లైఫ్ భయానక సంఘటనలు, అంధ విశ్వాసాల చీకటి కోణాన్ని తెరపై చూపించబోతున్న ‘హనీ’… తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త తరహా హారర్ అనుభూతిని అందించబోతుందనే నమ్మకం మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.