SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ సైంధవ్ (SAINDHAV). వెంకటేశ్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని హిట్ ఫేం శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రుహానీ శర్మ (Ruhani sharma), ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయా నటుల పాత్రల పోస్టర్లను విడుదల చేసిన వెంకీ టీం.. ముందుగా చెప్పిన ప్రకారం మానస్ (Manas)ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
ఇంతకీ మానస్ పాత్రలో కనిపించేది ఎవరనుకుంటున్నారా..? తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని టాలెంటెడ్ యాక్టర్ ఆర్య. లాంగ్ హెయిర్‌తో ఉన్న ఆర్య స్టైలిష్‌గా గన్ పట్టుకుని వస్తున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. సైంధవ్ మిషన్‌లో ఆర్య ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడన్నది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సైంధవ్ నుంచిలాంఛ్ చేసిన శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో రుహానీ శర్మ డాక్టర్‌గా కనిపించనుండగా.. నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో నటిస్తున్నాడు. మేకర్స్ అందించిన సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. సైంధవ్‌ను చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
మానస్ లుక్..
Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️🔥 pic.twitter.com/8P05gHCHxQ
— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023
ఇండిపెండెన్స్ డే స్పెషల్..
సైంధవ్ గ్లింప్స్ వీడియో..