రాజన్న భక్తులకు హెలికాప్టర్ సేవలు

రాజన్న సిరిసిల్ల :మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం హెలికాప్టర్ సేవలు ప్రవేశపెట్టింది.
గత సంవత్సరం మాదిరిగానే ఈసారి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ సేవలు భక్తులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది.
బుధవారం ఉదయం
10.30 గంటలకు
హెలికాప్టర్ సేవలను అధికారులు ప్రారంభించనున్నారు. గుడి చెరువు వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.
హెలికాప్టర్ ద్వారా
మధ్య మానేరు,
నాంపల్లి గుట్ట, వేములవాడ పుణ్యక్షేత్రం వీక్షించవచ్చు. ఒక్కో ప్రయాణికుడికి 7 నిమిషాలకు రూ. 3,000,
పదిహేను నిమిషాలకు రూ. 5,500 ప్రయాణ చార్జీలుగా నిర్ణయించారు.
వేములవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వారికి ఒక్కో ప్రయాణికుడికి రూ. 12,500 చార్జీలు వసూలు చేస్తున్నారు.
రాను, పోను రూ. 25,000లు
చార్జీలు వసూలు చేస్తారు. హైదరాబాద్ వెళ్లాలంటే ఆరుగురు ప్రయాణికులు తప్పనిసరిగా ఉంటేనే హెలికాప్టర్లో తీసుకెళ్తారు.
కాగా, హెలికాప్టర్లో ప్రయాణించే వారికి దర్శనం, భోజనం సౌకర్యాలు ఉండవని అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

