అణుభయం.. ఐరోపాలో అయోడిన్ మాత్రలకు గిరాకీ
లండన్: ఐరోపా నగరాల్లోని మెడికల్ స్టోర్లు, సూపర్ మార్కెట్లలో అయోడిన్ ట్యాబ్లెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దాదాపు అన్ని దుకాణాల్లో అయోడిన్ స్టాక్ అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ లేనట్టు యురోపియన్ వాసులు ఈ స్థాయిలో అయోడిన్‌ను కొనుగోలు చేయడానికి పెద్ద కారణమే ఉంది. ఉక్రెయిన్‌పై దాడుల్లో భాగంగా చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకొన్నాయి. అణ్వాయుధ దళాలు సంసిద్ధంగా ఉండాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎప్పుడైనా అణుయుద్ధం జరుగు తుందని ఐరోపావాసులు భావిస్తున్నారు. ఇదే జరిగితే, ప్రమాదకరమైన రేడియోయాక్టివ్ అయోడిన్ గాలిలోకి విడుదలయ్యే ప్ర మాదమున్నది. దాన్ని పీలస్తే థైరాయిడ్ క్యాన్సర్ వంటి జబ్బులు రావొచ్చు. కాబట్టి, రేడియోయాక్టివ్ అయోడిన్ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి నాన్-రేడియోయాక్టివ్ అయోడిన్ వాడితే ప్రమాదం ఉండదని ఐరోపావాసులు నమ్ముతున్నారు. అందుకే, వీలైనంత అయోడిన్ స్టాక్‌ను కొనుగోలు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

