నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట:సూర్యాపేటను మంచు దుప్పటి కప్పేసింది. శనివారం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు మంచు కురిసింది. చలి, పొగ మంచులోనూ ఎస్వీ డిగ్రీ కళాశాలలో పోలీసు ఉద్యోగార్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు సన్నద్ధం అవుతూ ఇలా కనిపించారు. అలాగే ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తిప్పలు పడ్డారు. వాహనదారులు దారి కనిపించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.
– సైదిరెడ్డి,