రాగల మూడు రోజుల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు | గల మూడు రోజుల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..

హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల తీరాల మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇదిలా ఉండగా.. సోమవారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

