ఇండోనేషియాలో భారీ వర్షాల బీభత్సం.. 44 మంది మృత్యువాత
భారీ వర్షాల బీభత్సం | తూర్పు ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు ధాటికి కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా 44 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుకాగా చాలామంది గల్లంతయ్యారని విపత్తు ఉపశమన సంస్థ తెలిపింది.

జకర్తా : తూర్పు ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు ధాటికి కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా 44 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుకాగా చాలామంది గల్లంతయ్యారని విపత్తు ఉపశమన సంస్థ తెలిపింది.
నుసా తెంగ్గరా ప్రావిన్స్‌లోని ఫ్లోరెస్ ద్వీపంలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షాలకు లామెనెలే గ్రామంలోని ఇండ్లను చుట్టుపక్కల కొండపైనుంచి వచ్చిన బురద ముంచెత్తింది.
దీంతో 38 మంది ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశాయి.
రాత్రి మొత్తం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నది తీరం సమీపంలోని వైబురక్ గ్రామాన్ని వరద ముంచెత్తడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గల్లంతయ్యారు.
గాయపడిన నలుగురికి స్థానికంగా చికిత్స అందిస్తున్నట్లు విపత్తు నిర్వహణ స్థానిక అధికారి ఓలా తెలిపారు. వందలాది ప్రజలు సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నారు.
రహదారులు కొట్టుకుపోవడం, విద్యుత్ అంతరాయం, వరద ఉధృతి తగ్గని కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని జాతీయ విపత్తు ఉపశమన సంస్థ అధికార ప్రతినిధి రాధిత్యజాటి తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు పూర్తిస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

