న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పండుగ సీజన్‌కు ముందు ఆహార పదార్థాల భద్రతను నిర్ధారించే లక్ష్యంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తన మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను కొనసాగించింది. ఎవరెస్ట్ ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదివారం తీసుకున్న తాజా చర్యలో ముందుగా ప్యాక్ చేసిన జీలకర్ర పొడిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
నమూనా పరీక్షలో జీలకర్ర పొడి సురక్షితం కాదని తేలడంతో క్రియేటివ్ బేకర్స్ అండ్ కన్ఫెక్షనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఎఫ్ఎస్ఎస్ఏఐ రద్దు చేసింది. గోవాలోని రివర్సైడ్ రిసార్ట్స్ అండ్ హాలిడే హోమ్స్ నుంచి జీలకర్ర పొడి నమూనాను సేకరించగా అందులో అజోక్సిస్టోబిన్ పురుగు మందుల అవశేషాలు బయటపడ్డాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.