సత్ఫలితాలిస్తున్న”హరితహారం”…

బొంరాస్పేట, ఆగస్టు:తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపదను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. రహదారులకు ఇరువైపులా రెండు మూడేండ్ల కిందట నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కొత్త అందాలను తెచ్చి పెడుతున్నాయి. ఒకప్పుడు రోడ్ల వెంబడి చెట్లు లేక బోసిపోయినట్లు కనబడే రహదారులు నేడు పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. మండలంలోని తుంకిమెట్ల-కోస్గి రహదారికి ఇరువైపులా అటవీ శాఖ అధికారులు మూడేళ్ల కిందట సుమారు 1500 మొక్కలు నాటారు.
నాటిన మొక్కలకు రక్షణగా కంచెను ఏర్పాటు చేసి నీళ్లు పోసి కాపాడారు. ఫలితంగా ఆ మొక్కలే నేడు చెట్లుగా మారాయి. రహదారిపై వెళ్తుంటే ప్రయాణీకులకు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. వేసవిలో ప్రయాణీకులకు నీడనిచ్చి ఎంతో ఉపయోగపడుతాయని ప్రజలు భావిస్తున్నారు. మండలంలోని ముచ్చుకుంటలో రహదారికి ఇరువైపులా హరితహారంలో ఏడాది కిందట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి రోడ్డుకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. తండా ప్రజల చొరవతో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి ఫలితాలిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

