హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లో మెగా కమర్షియల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్ మొదటివారంలో విమానాశ్రయం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
1930 నిజాం కాలంలో సైనిక అవసరాల కోసం నిర్మించిన ఈ ఎయిర్‌స్ట్రిప్ దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నది. మొత్తం 1,062 ఎకరాల్లో ఈ మెగా ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకోనున్నది.. 362 ఎకరాల రక్షణశాఖ భూమి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 700 ఎకరాల భూసేకరణను వేగవంతం చేసింది.